కొత్త ట్రెండ్ సెట్ చెయ్యనున్న తెలుగు సినీ అభిమానులు!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులు  అభిమాన నటుడిపై తన అభిమానం చాటాలంటే, థియేటర్స్ లో కటౌట్స్ రూపంలో చూపించుకునేవారు. తాజాగా వాళ్ళ అభిమానం బుల్లితెరపై కూడా చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం బుల్లితెరపై ప్రసారమవడంతో అభిమానులు మహేష్ కి హారతులు పట్టి నానా హంగామా విషయం మరిచిపోకముందే, ఆదివారం ‘ప్రేమికుల రోజు’ కానుకగా ప్రముఖ టీవీఛానల్ లో ప్రసారమైన రాంచరణ్ ‘బ్రూస్ లీ’ చిత్రంతో మరోసారి ఆ ట్రెండ్ ని ఫాలో అయ్యారు అభిమానులు.
సినిమా వస్తున్నంతసేపు రాంచరణ్ కి హారతులు పడుతూ, పూజలు చేస్తూ, బుల్లితెర ప్రేక్షకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఈ తతంగం అంతా చూసిన కొంతమంది ‘పిచ్చి పలు రకములు’అని ఎద్దేవచేసారు.కొంత మంది మాత్రం ఇదో టైపు అభిమానం అనుకోగా, మరికొంతమంది ‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అని లైట్ తీసుకున్నారు.పెద్దవాళ్ళయితే ‘పిచ్చి పీక్ స్టేజి కి’ వెళ్ళిపోయిందని,చేసేదేమీ లేదని అనుకొంటున్నారు. ఏదేమైనా థియేటర్స్ లో పాలాభిషేకాలు, కటౌట్స్ మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఇలా పూజలు చేస్తూ హారతులు పడుతూ అభిమానాన్ని చాటుకోవచ్చని మన తెలుగు ప్రేక్షకులు ట్రెండ్ సెట్ చేసి ఇతర రాష్ట్రాల అభిమానులను కూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యేలా చేసేట్టు ఉన్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus