2022లో బాలీవుడ్‌లో ఏ తెలుగు డబ్బింగ్ సినిమా ఎంత వసూలు చేసిందంటే..?

మరో రెండు వారాల్లో 2022 కంప్లీట్ అయిపోతుంది.. ఎప్పటిలానే కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనుంది తెలుగు ఇండస్ట్రీ.. పాండమిక్ కారణంగా రెండేళ్లకు పైగా నానా ఇబ్బందులు పడిన చలనచిత్ర పరిశ్రమకి పోయిన సంవత్సరం చివరి నెలలో వచ్చిన ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమేకాక.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటనేది మరోసారి రుచి చూపించింది.. ‘కెజీఎఫ్ 2’, ‘విక్రమ్’ ‘కాంతార’ లాంటి డబ్బింగ్ బొమ్మలు సంచలనం సృష్టించడమే తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి..

మన తెలుగు సినిమాలు నార్త్‌లోనూ సత్తా చాటాయి.. బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారిని ఆశ్చర్యపరచడమే కాక, ఒకింత షాక్‌కి గురిచేశాయి మన సినిమాలు సాధించిన కలెక్షన్లు.. గతేడాది ‘పుష్ప : ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. 2021లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.. ఆ దెబ్బకి నార్త్ వాళ్లు కంగారు పడ్డారు.. ఎందుకంటే ఏ హిందీ సినిమా వసూళ్లు కూడా ‘పుష్ప’ దరిదాపుల్లోకి రాలేదు ఆ సంవత్సరం..

ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి సాలిడ్ షాక్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీ.. అక్కడ జనాలు కూడా తెలుగు సినిమాల వైపే మొగ్గు చూపడం విశేషం.. 2022లో హిందీ మార్కెట్‌లో హవా కొనసాగించిన తెలుగు డబ్బింగ్ సినిమాలు, వాటి కలెక్షన్ల తాలుకు వివరాలు ఇలా ఉన్నాయి.. (తెలుగు నుండి హిందీలోకి డబ్ అయినవి మాత్రమే)..

1. రాధే శ్యామ్ – రూ. 22.25 కోట్లు..

2. ఆర్ఆర్ఆర్ – రూ. 277 కోట్లు..

3. మేజర్ – రూ. 13 కోట్లు..

4. కార్తికేయ 2 – రూ. 34 కోట్లు..

5. సీతా రామం – రూ. 8.6 కోట్లు..

6. లైగర్ – రూ. 21.2 కోట్లు..

7. గాడ్ ఫాదర్ – రూ. 10 కోట్లు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus