Bigg Boss Tamil: కమల్ హాసన్ షోలో తెలుగమ్మాయికి ఛాన్స్!

తెలుగులో బిగ్ బాస్ ఐదో సీజన్ నడుస్తోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో వారంలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు తమిళంలో ఐదో సీజన్ మొదలైంది. ఆదివారం నాడు కర్టెన్ రైజర్ ప్రసారమైంది. తెలుగులో మాదిరే తమిళంలో కూడా ఈసారి ఎక్కువ మంది కంటెస్టెంట్ లను రంగంలోకి దించారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ వచ్చింది. అందులో ఓ తెలుగమ్మాయి ఉండడం విశేషం. ఆ అమ్మాయి పేరు పావని రెడ్డి.

తెలుగులో కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ‘ఆమె ది ఎండ్’, ‘డబుల్ ట్రబుల్’, ‘లజ్జ’, ‘డ్రీమ్’ అనే చిన్న సినిమాల్లో నటించింది. అలాగే ‘అగ్నిపూలు’, ‘నా పేరు మీనాక్షి’, ‘నేను ఆయన ఆరుగురు అత్తలు’ అనే సీరియళ్లు కూడా చేసింది. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో కోలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ ఆమెకి చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు దక్కాయి. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్, షోలతో బిజీ అయింది.

నాలుగేళ్ల క్రితం మీడియాలో పావని పేరు బాగా నానింది. ఆమె భర్త, తెలుగు టీవీ నటుడు ప్రదీప్ కుమార్ సూసైడ్ అటెంప్ట్ చేయడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తరువాత ఆమె కోలీవుడ్ కి వెళ్లిపోయి చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. తమిళం నేర్చుకొని తమిళ సీరియల్స్, సినిమాలతో కొంచెం బిజీ అయిన పావనికి అక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఈమెకి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. మరి ఈ షోతో ఎలాంటి పేరు దక్కించుకుంటుందో చూడాలి!

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus