పవన్ సినిమాకి గేలం వేస్తున్న తెలుగమ్మాయి..!

పవన్ తో సినిమా అంటే.. ఎవరికి మాత్రం ఆత్రం ఉండదు. అందుకే “మీకు ఎవరితో పని చేయాలనుంది..” లేదా “మీ అభిమాన హీరో ఎవరు..?” అని మార్చి మార్చి ప్రశ్నలేసినా దీనిపై అగ్ర నాయికల దగ్గర్నుండి అరకొర అవకాశాలతో నెట్టుకొచ్చే భామల వరకూ అందరిదీ ఒకటే సమాధానం. పవన్ కళ్యాణ్ అని. అదే నామ జపం చేస్తూ పవన్ సినిమాలో అవకాశం కోసం గేలం వేస్తోంది ఓ తెలుగమ్మాయి.’బస్ స్టాప్’, ‘ప్రియతమా నీవచట కుశలమా’ వంటి తెలుసు సినిమాల్లో నటించి అటుపై ‘కయల్’, ‘త్రిష ఇల్లన నయనతార’, ‘విశారణై’ తదితర చిత్రాలతో తమిళనాట మంచి పేరు తెచ్చుకుంది వరంగల్ పోరి హాసిక అలియాస్ రక్షిత ఉరఫ్ ఆనంది.

ఇలా అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ తెలుగమ్మాయి చేతిలో ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలున్నాయి. వాటితో సంతృప్తి పడలేదేమో ఏమోగానీ పవన్ సినిమాలో నటించాలని ఉందంటూ ఇండైరెక్ట్ దర్శకులకు సూచనలిస్తోంది. అయితే ఆనంది ప్రయత్నాలు పవన్ తో ఆడిపాడేందుకు అనుకుంటే పొరపాటే.. చెల్లెలి పాత్రలో నటించడానికి. దీనివెనకాల అసలు మతలబు ఏమిటంటే.. పవన్ తమిళ దర్శకుడు నేశన్ తో ఓ సినిమా చేయనున్నాడుగా. ‘వేదాళం’ రీమేక్ గా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కీలకం. తమిళంలో అజిత్ చెల్లెలిగా హీరోయిన్ లక్ష్మి మీనన్ నటించింది. ఆనంది గేలం వేస్తోంది ఆ పాత్ర కోసమే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus