పొరిగింటి డైరక్టర్ల పై తెలుగు హీరోల ప్రేమ

తెలుగు సినీ పరిశ్రమలో అనుభవం, ప్రతిభ ఉన్నదర్శకులకు కొరత లేదు. కానీ మన హీరోల చూపు కోలీవుడ్ డైరక్టర్ల వైపే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల తాజా చిత్రాలను తమిళ తంబీలే చేస్తున్నారు. భళ్లాల దేవా రానా కూడా తమిళ డైరక్టర్ బాల తో పని చేయడానికి ఓకే చెప్పేశాడు. తెలుగు హీరోల ఆసక్తి గమనిస్తే.. పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత నిజమనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ v సూర్యపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత తమిళ్ డైరక్టర్ సూర్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధ మయ్యారు. సూర్య ఇది వరకు పవన్ తో ఖుషి, పులి సినిమాలు తీసాడు. ఒకటి హిట్ కాగ మరొకటి ఫ్లాప్ అయింది.

మహేష్ v మురుగ దాస్సూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తో తొలిసారి కలిసి పని చేయనున్నారు. ఈ తమిళ్ డైరక్టర్ గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా స్టాలిన్ తీశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ లో మంచి పేరుతెచ్చుకున్న మురుగదాస్ మహేష్ ని చెన్నైవాసులకు కొత్తగా పరిచయం చేయనున్నాడు. ఈ సినిమా జులై లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అల్లు అర్జున్ v లింగు స్వామికమల్ హాసన్ “ఉతమ విలన్” సినిమాను డైరక్ట్ చేసిన లింగుస్వామి చెప్పిన కథ నచ్చడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తమిళం, తెలుగులో ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో బన్నీ హీరో, విలన్ రెండూ పాత్రలు చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా తమిళ్ డైరక్టర్ విక్రమ్ కె కుమార్ తో చేయడానికి ఒకే చెప్పాడు. ఇష్క్, మనం, 24, సినిమాల తర్వాత అల్లు అర్జున్ కోసం విక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

నాగ చైతన్య v గౌతం మీనన్“ఏ మాయ చేసావే” చిత్రం ద్వారా నాగ చైతన్య కు హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతం మీనన్. ఇతని దర్శకత్వంలోనే యువసామ్రాట్ “సాహసమే శ్వాసగా సాగిపో” సినిమాలో నటించాడు. ఇప్పటివరకు ఏ దర్శకుడు చైతూ తో రెండు సినిమాలు తీయలేదు. ఆ క్రెడిట్ తమిల్ డైరక్టర్ గౌతం మీనన్ కే దక్కింది.

రానా v బాలప్రస్తుతం బాహుబలి – ది కంక్లూజన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నరానా .. ఈ చిత్రం పూర్తి కాగానే తేజ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆర్ట్ చిత్రాలు తీసే తమిల్ డైరక్టర్ బాల దర్శకత్వంలో మూవీ ఉంటుందని రానా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus