ఈవారం రిలీజవుతున్న సినిమాలు..!

  • March 22, 2018 / 12:26 PM IST

గతవారం భారీ ఆశలు పెట్టుకొని థియేటర్లకి వెళ్ళిన సినిమా అభిమానులు నిరాశతో వెనుతిరిగారు. అందుకు కారణం హిందీ సినిమా “రెయిడ్” తప్ప మరో సినిమా అలరించలేకపోవడమే అందుకు కారణం. అయితే.. ఈ శుక్రవారం మాత్రం మంచి ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి ప్రశంసలు, అభినందనలు అందుకొన్న “నీది నాది ఒకే కథ” రేపు విడుదలవుతుండగా.. మలయాళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న ఓ చిత్రాన్ని “ఆనందం” పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఇవి కాకుండా కమర్షియల్ పాట్ బాయిలర్ “ఎమ్మెల్యే” కూడా రేపు విడుదలవుతోంది. కాజల్ అందాలు, కళ్యాణ్ రామ్ కామెడీ యాంగిల్ ప్రత్యేక ఆకర్షణలుగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. వీటితోపాటు కన్నడ-తెలుగు భాషల్లో బైలింగువల్ గా రూపొందిన “రాజ రధం” కూడా రేపు విడుదలవుతోంది. ఇవి కాకుండా రాణీ ముఖర్జీ నటించిన “హిచ్ కీ” కూడా రేపు విడుదలవుతోంది. ఆంగ్ల యాక్షన్ చిత్రం “పసిఫిక్ రిమ్” కూడా రేపు విడుదలవుతోంది. మొదటి పార్ట్ మంచి విజయం సాధించి ఉండడంతో హాలీవుడ్ యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus