సినీ’రంగుల’ ప్రపంచంలో రంగేళీ ‘హోలీ’

  • March 23, 2016 / 03:09 PM IST

కొట్టు కొట్టు కొట్టు…రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉంది రా…అని నవ మన్మధుడు నాగార్జున అందాల భామలతో రాసలీలలు ఆడినా, రంగు రబ్బ..రబ్బ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానాతో కలసి రంగుల్లో మునిగి తేలినా,  బాలామణి…బాలామణి అంటూ మనోజ్, తాప్సీతో జూమ్మంది నాదాన్ని వినిపించినా, రంగేలీ హోలీ…హంగామా కేళీ అంటూ ప్రభాస్ అందాల భామలతో ఆడిపడినా, రేపల్లె మళ్ళీ మురళి విన్నది…ఆ పల్లె కధే పలుకుతున్నది అంటూ మిల్కీ గర్ల్ మీనా మోహన్ బాబుతో సరసం ఆడినా, ఆ సంధర్భాలు…ఆ సయ్యాటలు అన్నింటికీ వేదిక అయ్యింది హోలీ పండుగ…. కుటుంభ సమేతంగా, స్నేహితులతో కలసి జరుపుకునే ఆహ్లాదకరమైన ఈ హోలీ పండుగను మన సినీ స్క్రీన్ పై కూడా ఎన్నో సంధర్బాల్లో చూస్తూనే ఉన్నాం. ఎందరో దర్శకులు వారి వారి ఆలోచనల పుణ్యమా అంటూ హోలీని సరికొత్తగా చూపిస్తూనే… ఆ రంగుల పండుగకు సరికొత్త రంగును అద్ది కొత్త అర్ధాన్ని మనకు చూపించారు..

సంధర్భం ఏదైనా…సందడి ఏమైనా…మన అందాల తారలు హోలీ రంగుల్లో మునిగి తేలిన ఎన్నో ప్రేమ కధలు సైతం మన తెలుగు తెరపై ఆవిష్కృతం అయ్యాయి. మరి అలాంటి వాటిల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

హోలీ: ఉదయ్ కిరణ్-రిచా

ఈ చిత్రంలో హోలీ పండుగ రోజున తన మదిలోని ప్రేమను తెలియజేస్తాడు మన హీరో, అయితే పెళ్ళికి ముందు ప్రేమ నచ్చదు అని, పెళ్లి చేసుకున్న తరువాత ప్రేమిస్తాను అని హీరోయిన్ చెబుతుంది. ఇక దానికి మన హీరోగారు  పెళ్ళికి ముందు కొన్నాళ్ళు ప్రేమించుకుందాం అని, ఒకళ్ళకు ఒకరు అర్ధం చేసుకుని పెళ్ళిచేసుకుందాం అని చెబుతాడు. ఇలా ఆ కధ అనేక మలుపులు తిరిగి చివరకు వాళ్ళ ప్రేమను గెలిపించుకుంటారు.

దేవదాస్: రామ్-ఇలియాన

ఈ చిత్రంలో సైతం ప్రేమను గెలిపించుకుందుకు హీరో అమెరికాలో హోలీ ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.

ఓయ్: సిద్దార్థ్-షామిలీ

ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంభంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్ గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేస్తా హీరో చివరకు ప్రేమ కధను ముగిస్తాడు.

ఇంద్ర – చిరంజీవి

సీమలోని నీళ్ళ కష్టాల గురించి హీరోకు తెలిపేందుకు హోలీ పండుగను ఉపయోగించుకున్నాడు మన దర్శకుడు. ‘ఎంతో మంది తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ఆల్లాడి పోతుంటే, ఇక్కడ గుండిగలు…గుండిగలు నీళ్ళు వృద్దా చేస్తున్నారు’ అన్న పిలుపు విన్న హీరో సరికొత్త చరిత్రకు శ్రీకారం చూడతాడు.

పగ: జయం రవి – భావన

పగ సినిమాలో సైతం హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమాను బంధాన్ని తెలియజేసే క్రమంలో హోలీ పండుగను వేదికగా చేసుకున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను బెదిరించి మరీ ఆమెతో హోలీ అదే సీన్ ప్రేక్షకులకు పులకింత పెట్టిస్తుంది.

ఇలా రంగుల హోలీను తమదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను సినీ రంగుల ప్రపంచంలో మునిగి తేల్చారు మన సినీ ప్రముఖులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus