Anchor: బుల్లితెర బోల్డ్ యాంకర్ చిన్నప్పటి ఫోటో వైరల్!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోల కోసమే ఫాలోవర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. తమ అభిమాన నటుడు లేదా నటికి సంబంధించి అన్ సీన్ పిక్ ఏమొచ్చినా క్షణాల్లో వైరల్ చేసాయాలనేది వారి తాపత్రయం. ఇందులో వారికి తెలీని ఓ ఆనందం ఉంటుంది. నటీనటులు కూడా తమ చిన్నప్పటి ఫోటోలను సందర్భానుసారంగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. వారికి ఎలాగు లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, అలాగే పిక్ ఏమైనా తేడాగా ఉంటే ట్రోలింగ్ సైట్స్ కూడా అటెన్షన్ తో ఆ ఫోటోలను మీమ్స్ గా చేసి వైరల్ చేసే పని పెట్టుకుంటారు.

సరే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నటి ఫోటో ఎవరిదా అనే ఆసక్తి కొంతమందికి పుట్టొచ్చు. లేదా.. ఆ ఫోటోలో ఉన్న నటిని కొంతమంది గుర్తుపట్టేసి ఉండొచ్చు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు విష్ణు ప్రియా. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన విష్ణుప్రియ.. అటు తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా సక్సెస్ కాలేకపోయింది. అయితే బుల్లితెర పై ‘పోవే పోరా’ వంటి షోలతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడు ఇంకా ఫేమస్ అనే చెప్పాలి. కురచ దుస్తుల్లో..పలు మాస్ పాటలకి ఈ అమ్మడు చేసే డాన్స్ లు మామూలుగా ఉండవు. సోషల్ మీడియాలో విష్ణుప్రియకి భీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాలి. అయితే ఫిజిక్ విషయంలో ఈమెను ట్రోల్ చేసే బ్యాచ్ కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా..

ఈ ఏడాది జనవరి చివర్లో (Anchor) విష్ణు ప్రియా తల్లి మరణించడంతో ఆమె డీలా పడిపోయింది. అందుకోసం అప్పుడప్పుడు తన లైఫ్ లోని బెస్ట్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంటూ రిలీఫ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా విష్ణుప్రియా తాజాగా తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసినట్టు స్పష్టమవుతుంది

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus