‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి యల్’. సందీప్ కిషన్,హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 15న(నిన్న) విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ మొట్టకట్టుకుంది. రివ్యూలు కూడా చాలా బ్యాడ్ గా వచ్చాయి. కానీ సందీప్ కిషన్ గత చిత్రం బాగానే ఆడింది కాబట్టి.. ప్రమోషన్లు కూడా ఈ చిత్రానికి గట్టిగా చేశారు కనుక తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.20 cr
సీడెడ్ 0.06 cr
ఉత్తరాంధ్ర 0.07 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.03 cr
కృష్ణా 0.05 cr
గుంటూరు 0.04 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ 0.54 cr(share)

ఈ చిత్రానికి 5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రానికి 0.54 కోట్ల(షేర్) ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 4.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజు ప్లాప్ టాక్ రావడంతో రెండో రోజు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ వీకెండ్ నే ఈ చిత్రం క్యాష్ చేసుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి చివరికి ఎంత రాబడుతుందో చూడాలి..!

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus