‘తలైవి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తప్పులు ఉన్నాయని అన్నాడీఎంకే నేత, మాజీ మణ్డత్రి జయకుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చెన్నైలో ‘తలైవి’ సినిమా చూసిన అన్నాడీఎంకే నేత జయకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాను ఏఎల్ విజయ్ చాలా చక్కగా తెరకెక్కించారని..
అయితే ఇందులో ఎంజీఆర్, జయలలిత మధ్య జరిగిన కొన్ని సన్నేవేశాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను తప్పుగా చూపించారని.. ఎంజీఆర్, జయలలితకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వనట్లుగా ఆ సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ సీన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంజీఆర్, కరుణానిధి పాత్రల మధ్య జరిగిన కొన్ని సీన్లపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంజీఆర్ తొలి డీఎంకే ప్రభుత్వంలో పదవులు ఆశించలేదని.. కానీ ఈ సినిమాలో ఆయన మంత్రి పదవి కోరగా దీనిని అప్పటి డీఎంకే సీఎం అన్నాదురై, ఎం కరుణా నిధిలు అడ్డుకున్నట్లు చూపించారని..
ఇది నిజం కాదని అన్నారు. ఎందుకంటే డీఎంకే సీఎం అన్నాదురై ఎంజీఆర్‌ను మంత్రిని చేయాలనుకున్నారని చెప్పారు. కానీ ఎంజీఆర్ మంత్రి పదవిని తిరస్కరించారని.. దీంతో అన్నాదురై కొత్తగా ఓ శాఖను కేటాయించి దానికి ఆయనను డిప్యూటీ చీఫ్‌గా నియమించారని చెప్పారు.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!