ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తన సినిమా కెరీర్‌పై పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై సినిమాలు చేయనని, ప్రజాసేవకే తన పూర్తి సమయం కేటాయిస్తానని అధికారికంగా ప్రకటించారు. శనివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇందుకు వేదికైంది. హెచ్.వినోద్ డైరెక్షన్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రమే తన కెరీర్‌లో లాస్ట్ మూవీ అని విజయ్ స్పష్టం చేశారు.
పొంగల్ రేసులో నిలవనున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేదికగా ఆయన తన రిటైర్మెంట్‌ను కన్ఫర్మ్ చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య విజయ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. “మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 33 ఏళ్లుగా మీరే నా వెంటే ఉన్నారు. నాకోసం సర్వస్వం వదులుకున్న మీలాంటి అభిమానుల కోసం.. ఇప్పుడు నేను నా సినిమాలను వదులుకుంటున్నాను. రాబోయే కాలంలో మీతోనే, మీ కోసమే నిలబడాలని నిర్ణయించుకున్నా” అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
రాజకీయ ఎంట్రీపై వస్తున్న ప్రశ్నలకు కూడా విజయ్ తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చారు. వచ్చే ఎలక్షర్స్‌లో ఒంటరిగా వస్తారా? లేదా పొత్తులతో వస్తారా? అని చాలామంది అడుగుతున్నారని.. అయితే 33 ఏళ్లుగా అభిమానులతో జట్టుగానే వచ్చానని, ఇకపై కూడా అలాగే వస్తానని అన్నారు. ఈ వివరణ సరిపోదేమో, కానీ సస్పెన్స్‌లోనే అసలైన కిక్ ఉంటుందంటూ పొలిటికల్ హీట్ పెంచే కామెంట్స్ చేశారు. మొత్తానికి విజయ్ చేసిన ఈ కామెంట్స్‌తో ఆయన ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది.