ఆ విషయంలో తెలుగు హీరోలనే ఫాలో అవుతున్న తమిళ స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీ కాంత్ తరువాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్! అయితే అందరి హీరోల ఫ్యాన్స్ కంటే కూడా.. విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో అజిత్ ఫ్యాన్స్ తో వీరు గొడవలు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొన్నటికి మొన్న విజయ్ ను ఐటీ అధికారులు విచారించడానికి వస్తే.. ఆ షూటింగ్ స్పాట్ కు లక్షలాది మంది తరలి వచ్చారు. కాగా ఇప్పుడు ఆ సందర్భాన్ని తలుచుకునే విజయ్ ఓ విషయంలో తెగ కంగారు పడుతున్నాడట.

విషయం ఏమిటంటే.. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉంది. ఓ పక్కన వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నా కానీ తమిళ ప్రజలు కొంచెం కూడా భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే.. అతని పుట్టినరోజున పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించాలి అని ప్లాన్స్ వేసుకుంటున్నారట. అసలే తమిళనాడులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో విజయ్ పుట్టినరోజు వేడుకలు కనుక నిర్వహిస్తే.. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుంది. అందుకే ఈ విషయంలో విజయ్ మన తెలుగు హీరోలనే ఫాలో అవుతూ అభిమానులకు ఓ లేఖ రాసాడట.

Corona Health officials investigated in Vijay house 1

దయచేసి అతని పుట్టినరోజున అభిమానులు గుంపులుగా కూడావద్దని.ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని… నా పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టాలి అనుకున్న డబ్బుని.. పేదవారికి దానం చేస్తే.. నాకు మీరు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టే సంతోషిస్తానని’ ఆ లేఖలో పేర్కొన్నాడు. తెలుగులో కూడా రాంచరణ్,ఎన్టీఆర్, బాలకృష్ణ, రామ్ వంటి హీరోలు ఇలాగే అభిమానులకు తమ పుట్టినరోజున వేడుకలు నిర్వహించవద్దు అని కోరుతూ’ ఓ లేఖను విడుదల చేసారు. వారు కోరినట్టే అభిమానులు కూడా సైలెంట్ గా ఉన్నారు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus