తమిళ సినీ హీరో విజయ్ ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు. అసలే రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో ఇంత హఠాత్తుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు అనేది హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కూడా గత కొంతకాలంగా తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అతన్ని రాజకోయంగా కొందరు కావాలని టార్గెట్ చేశారు.
అలాగే విజయ్ పై స్పెషల్ గా ఐటీ దాడులు చేయడం కూడా అప్పట్లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి రావచ్చని ఆ మధ్య స్వయంగా ఆయన తండ్రి కూడా చెప్పడం అందరిని ఆశ్చర్యన్ని కలిగించింది. ఇక రాజకీయాలకు సంబంధించిన వార్తలు ఎన్ని వస్తున్నా కూడా విజయ్ ఏనాడు కూడా వాటిపై స్పందించలేదు. వస్తానని అనలేదు అలాగని రానని అనలేదు. కానీ రాజకీయ నాయకులను మాత్రం ఎదో ఒక విధంగా కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గా విజయ్ తెలంగాణలో ప్రత్యేకంగా సీఎం కేసియార్ ను కుసుకోవడంపై అనేక రకాల పొలిటికల్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే వారి సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం కేవలం మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు చెబుతున్నారు. అయినా కేసీఆర్ రాజకోయల్లో ఉన్న తమిళ హీరోలను కూడా కలవలేదు. అలాంటిది విజయ్ ను ప్రత్యేకంగా మీట్ అయ్యారంటే దాని వెనుక ఏదో రాజకీయ రహస్యం ఉండే ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే కొనసాగుతోంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమా చెబుతున్నారు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!