Vijay, Rajinikanth: విజయ్ రుణం తీర్చుకోబోతున్న నెల్సన్.. అలాంటి మూవీని ప్లాన్ చేశారా?

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే జైలర్ సినిమాతో రజనీకాంత్ కోరుకున్న భారీ విజయం దక్కింది. ఈ సినిమా సక్సెస్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జైలర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ దిల్ రాజుకు అదిరిపోయే స్థాయిలో లాభాలను అందిస్తోంది. అయితే జైలర్ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఇప్పటికే క్లారిటీ రాగా తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

రజనీకాంత్ విజయ్  (Vijay) కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జైలర్ సినిమాతో పాటు తాను తీసిన గత సినిమాలకు కూడా సీక్వెల్స్ తీస్తానని నెల్సన్ వెల్లడించారు. ఫ్లాప్ గా నిలిచిన బీస్ట్ సినిమాకు సైతం సీక్వెల్ తీస్తానని నెల్సన్ దిలీప్ కుమార్ వెల్లడించడం గమనార్హం. జైలర్ పార్ట్1 ను మించి జైలర్ పార్ట్2 ఉండబోతుందని నెల్సన్ దిలీప్ కుమార్ ప్రకటన చేయడం గమనార్హం. రజనీకాంత్ విజయ్ కాంబినేషన్ లో సినిమా తీయడం నా కోరిక అని త్వరలోనే ఈ కోరిక తీరనుందని నెల్సన్ దిలీప్ కుమార్ వెల్లడించారు.

నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్2 సినిమా గురించి ఈ కామెంట్లు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ రెమ్యునరేషన్ సైతం భారీగా పెరిగిందని తెలుస్తోంది. జైలర్2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జైలర్2 సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు నెల్సన్ రేంజ్ ను పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నెల్సన్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. నెల్సన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. రజనీకాంత్ కు భారీ సక్సెస్ రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. నెల్సన్ ఈ సినిమాతో విజయ్ రుణం తీర్చుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus