Beast Trailer: బీస్ట్ ట్రైలర్.. ఉగ్రవాదులపై విజయ్ ఊచకోత.!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏప్రిల్ 13వ తేదీన విడుదల కానున్న సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ట్రైలర్ లో విజయ్ నెవ్వర్ బిఫోర్ అనేలా యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. తుపాకీ సినిమా తరువాత మళ్ళీ సోల్జర్ పాత్రలో నటిస్తున్న విజయ్ ఈసారి అంతకుమించి అనేలా కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Click Here To Watch NOW

బీస్ట్ టైటిల్ కు తగ్గట్టుగా ఉగ్రవాదులను ఊచకోత కోసే భయంకరమైన సోల్జర్ పాత్రలో విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్ ను హైజాక్ చేసిన టెర్రరిస్ట్ ల నుంచి హీరో జనాలను కాపాడుతున్న విధానం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ఏ మాత్రం కనికరం లేకుండా హీరో కూడా ఉగ్రవాదుల కంటే భయంకరంగా మంచి కోసం పోరాడుతున్న విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమాలో పవర్ఫుల్ గన్స్ చాలానే కనిపిస్తున్నాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన సాంగ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ట్రైలర్ అంతకు మించి అనేలా ఆడియెన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది. ఆకాశంలో హీరో మిసైల్స్ ను వధులుతున్న సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉన్నాయి. ఎక్కడా తగ్గకుండా దర్శకుడు ఫుల్ ఫ్రీడమ్ తో పవర్ఫుల్ సోల్జర్ గా విజయ్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

బీస్ట్ రంగంలోకి దిగితే ఎలాంటి ఉగ్రవాదులు అయినా సరే చెల్లా చెదురు కావాల్సిందే అని అనిపోస్తోంది. ఇక దర్శకుడు సెల్వా రాఘవన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక ఏప్రిల్ నెలలో KGF 2తో పోటీ పడబోయే బీస్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus