Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

రష్మిక మందనకి టైం ఇప్పుడు మంచిగా ఉంది. ఆమె ఏ సినిమా చేసినా మంచి విజయం అందుకుంటుంది. ‘యానిమల్’ నుండి చూసుకుంటే ‘పుష్ప 2’ ‘చావా’ ‘కుబేర’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంది రష్మిక. ఆ సినిమాలు మొత్తం కలిపితే బాక్సాఫీస్ వద్ద రూ.3000 కోట్ల వరకు కలెక్ట్ చేశాయి. దీంతో రష్మిక మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పాలి. ఆమె పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని అంతా భావిస్తున్నారు.

Thama Teaser

ఈ క్రమంలో వచ్చే రష్మిక సినిమాల పై ట్రేడ్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆమె ‘ది గర్ల్ ఫ్రెండ్’ ‘ధామా’ వంటి సినిమాల్లో నటిస్తోంది. సెప్టెంబర్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కానుంది ఆ వెంటనే అంటే అక్టోబర్లో ‘ధామా’ రిలీజ్ కానుంది. తాజాగా ‘ధామా’ నుండి టీజర్ ను వదిలారు.

‘భేడియా’ ‘స్త్రీ’ ‘ముంజ్యా’ సినిమాల యువర్స్ లో భాగంగా రూపొందిన సినిమా ‘థామా’. ఆయుష్మాన్ ఖురానాకి జోడీగా రష్మిక మందన నటించింది. ఇందులో రష్మిక అతీంద్రియ శక్తులు కలిగిన అమ్మాయిగా కనిపించనుంది. కొన్ని విజువల్స్ చూస్తుంటే ఆమె గబ్బిలంగా కనిపించబోతుందేమో అనిపిస్తుంది. అది నిజమైతే కెరీర్లో ఆమె ఛాలెంజింగ్ రోల్ చేస్తుందనే అనుకోవాలి. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ పార్ట్ ఎక్కువగానే ఉండబోతుంది అని టీజర్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఆదిత్య సర్పోత్దార్ ఈ చిత్రానికి దర్శకుడు. అతని సినిమాలపై బాలీవుడ్లో మంచి నమ్మకం ఏర్పడింది. మరి ఈ థామా ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో.. రష్మిక కెరీర్ కు ఎంత వరకు ప్లస్ అవుతుందో తెలియాలి అంటే.. అక్టోబర్ వరకు ఆగాల్సిందే. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus