Thaman,Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు మాట ఇచ్చిన థమన్.. ఏం చెప్పారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ తర్వాత రాజమౌళి సినిమా కోసం లుక్ మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు కారం ఇప్పటివరకు బాగానే కలెక్షన్లను సాధించినా ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదనే సంగతి తెలిసిందే. అయితే గుంటూరు కారం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన థమన్ అభిమానులకు అదిరిపోయే తీపికబురు అందించారు. థమన్ గుంటూరు కారం జ్యూక్ బాక్స్ కు సంబంధించిన యూట్యూబ్ లింక్ ను షేర్ చేయడంతో పాటు మహేష్ బాబు వీరాభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక పాటను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

ఈ పాట అభిమానులకు విందు భోజనంలా ఉండనుందని థమన్ చెప్పుకొచ్చారు. అభిమానులకు థమన్ అందించిన ఈ తీపికబురు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేసింది. థమన్ చేసిన ప్రకటనను మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి సినిమాకు సంబంధించిన క్లారిటీ కోసం, అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, ఈ సినిమా కోసం పని చేసే టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

రాజమౌళి ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహేష్ (Mahesh Babu) సినిమా స్క్రిప్ట్ కోసం రాజమౌళి దాదాపుగా రెండేళ్ల సమయం కేటాయించడంతో ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో ఉండబోతుందని అయితే షూటింగ్ కు మాత్రం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus