టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న డైరెక్టర్ల నుంచి పెద్ద డైరెక్టర్ల వరకు తమ సినిమాలకు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు థమన్ పుట్టినరోజు కాగా సినీ ప్రముఖులు థమన్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం థమన్ ఏకంగా 13 సినిమాలకు సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది.
ఒక్కో సినిమాకు థమన్ 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. గతేడాది పది సినిమాలకు థమన్ సంగీతం అందించగా ఈ ఏడాది థమన్ చేతిలో గతంలో కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, అఖండ, గని, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ, ఏజెంట్, చరణ్ శంకర్ కాంబో మూవీ, సూపర్ మచ్చి, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలతో పాటు థమన్ బెబ్బులి, వా డీల్, మలయళమూవీ కేదువ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. తెలుగులో మరే మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఈ స్థాయిలో సినిమాలు లేవు. మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా థమన్ సాంగ్స్ ఉండటంతో థమన్ కు క్రేజ్ పెరుగుతోంది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు థమన్ తో పనిచేయడానికి చాలా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. నెల్లూరులో జన్మించిన థమన్ ఎంతో కష్టపడి మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ స్థాయికి చేరుకున్నారు.