చిరు నెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు అయ్యాడు. స్వయంగా చిరు ఈ విషయాన్ని వెల్లడించారు. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన రొమాంటిక్ సినిమా “శ్రీరస్తు శుభమస్తు”. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్  నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ “తండ్రి కొడుకుల  మధ్య సంఘర్షణను డైరక్టర్ పరుశురాం అద్భుతంగా తెరకెక్కించారు.

ఇదో మరో బొమ్మరిల్లు అవుతుంది. ఇందులో అల్లు శిరీష్ నటన చాలా బాగుంది. లావణ్య అందాలు ఈ సినిమా విజయానికి ప్లస్ అవుతుంది.” అని వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎస్.ఎస్.థమన్ గురించి ప్రస్తావిస్తూ “నేను థమన్ పాటలు మొదట వింటున్నప్పుడు .. లిరిక్స్ ని మ్యూజిక్ డామినేట్ చేస్తుందని అనుకున్నాను. కానీ ఆ స్టయిల్ మనల్ని పాటలకు అడిక్ట్ చేస్తాయని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ స్టైల్ లోనే వెళ్లు థమన్” అని అభినందించారు.

“నా 151 వ సినిమా కోసం మంచి ట్యూన్స్ ని ఇప్పటి నుంచే కంపోజ్ చేసి పెట్టు.. తప్పకుండా నీకే అవకాశం ఇస్తాను”  అని మెగాస్టార్ వేదిక పై నుంచే అందరి ముందు థమన్ కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి 150 వ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus