Thaman, Trivikram: తమన్ కి త్రివిక్రమ్ సపోర్ట్ పెరిగిందా..!

రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘స్కంద’ అనే సినిమా రూపొందింది. సెప్టెంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. రామ్ కెరీర్లోనే ఈ సినిమా హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఓవరాల్ ‘స్కంద’ మూవీ ఓకే. కానీ దీని వల్ల ఎవరికైనా డ్యామేజ్ జరిగిందా అంటే.. అది సంగీత దర్శకుడు తమన్ కే జరిగింది అని చెప్పాలి.

‘స్కంద’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ పూర్తిగా డిజప్పాయింట్ చేశాడు అనే కామెంట్స్ ముందు నుండీ వినిపించాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే బోయపాటి.. ‘తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తీసేసినా ‘అఖండ’ లో కొన్ని సన్నివేశాలు బాగుంటాయి’ అని అనడం పెద్ద దుమారాన్ని రేపాయి. అది పక్కన పెడితే.. ‘గుంటూరు కారం’ సినిమా మ్యూజిక్ విషయంలో హీరో మహేష్ బాబు మొదటి నుండీ సంతృప్తిగా లేడు అనే కామెంట్స్ వినిపించాయి.

‘స్కంద’ రిజల్ట్ తో మహేష్ ఫ్యాన్స్ లో కూడా అలజడి మొదలయ్యింది అని చెప్పాలి. దీనికి ముందు వచ్చిన ‘బ్రో’ విషయంలో కూడా తమన్ నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేశాడు. దీంతో ‘గుంటూరు కారం’ విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తమన్ తో కలిసి సెపరేట్ గా మ్యూజిక్ సిట్టింగులు వేసి 3 పాటలు ఫైనల్ చేశాడట (Trivikram) త్రివిక్రమ్. ఇక మొత్తంగా ఈ సినిమాలో 5 పాటలు ఒక బిట్ సాంగ్ ఉంటుంది అని తెలుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus