మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఈ ఏడాది ‘గుంటూరు కారం’ తో (Guntur Kaaram) వచ్చి మెప్పించలేకపోయారు. దీంతో అల్లు అర్జున్ తో (Allu Arjun) చేస్తున్న తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ పూర్తికావచ్చింది. త్వరలోనే అల్లు అర్జున్ ని కలిసి ఫైనల్ నెరేషన్ ఇస్తారు. బన్నీ ఏమైనా మార్పులు సూచిస్తే.. వాటిపై కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా 2025 సమ్మర్ కి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయ్యాక.. అల్లు అర్జున్ కొంతమంది తెలుగు పండితులతో తెలుగు క్లాసెస్ తీసుకుంటారట. మరోపక్క తన లుక్ ని మార్చుకోవడానికి కూడా జిమ్లో కసరత్తులు చేస్తారని అల్లు అర్జున్ టీం చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది మైథలాజికల్ టచ్ ఉన్న కథ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే సంగీత దర్శకుడి విషయంలో కూడా కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
‘అరవింద సమేత’ నుండి త్రివిక్రమ్.. సంగీత దర్శకుడు తమన్ తో (S.S.Thaman) ఎక్కువగా ట్రావెల్ అవుతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ చేసిన ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) ‘గుంటూరు కారం’ సినిమాలకి తమన్ సంగీతం అందించాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి తమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు.ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ‘గుంటూరు కారం’ సినిమాకి ‘అల వైకుంఠపురములో’ రేంజ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. అలా అని తక్కువ కూడా చేయలేదు. అంచనాలు అయితే మ్యాచ్ చేయలేదు అనేది వాస్తవం.
పైగా ఆ సినిమా షూటింగ్ టైములో ‘తమన్ ని తీసేస్తున్నారు’ అంటూ రూమర్స్ కూడా వచ్చాయి.హీరో మహేష్ బాబు (Mahesh Babu) కూడా తమన్ వర్క్ తో సంతృప్తిగా లేడనే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో త్రివిక్రమ్.. చొరవ చేసుకుని మహేష్ ను ఒప్పించి ‘గుంటూరు కారం’ తమన్ తోనే చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమాకి తమన్ ను కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా లేవట. అనిరుధ్ (Anirudh Ravichander) వంటి మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చూడాలి మరి.. ఏమవుతుందో..!