‘గీత గోవిందం’ లో ‘ఇంకేం ఇంకేం కావాలె’ పాటతో సిద్ శ్రీరామ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అతని గాత్రం యూత్ కి విపరీతంగా నచ్చేసింది. అటు తర్వాత ‘టాక్సీ వాలా’ లో ‘మాటే వినదుగా’, ‘హుషారు’ లో ‘ఉండి పోరాడే’, ‘అల వైకుంఠపురములో’ ‘సామజవరగమన’, ‘సర్కారు వారి పాట’ లో ‘కళావతి’ వంటి పాటలు.. సిద్ స్థాయిని అమాంతం పెంచేసాయి. అంతకు ముందు కూడా ‘ఐ’ వంటి సినిమాల్లో సిద్ పాటలు పాడాడు.
కానీ సిద్ (Sid Sriram) రేంజ్ ను పెంచింది ‘గీత గోవిందం’ సినిమా అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ సిద్ శ్రీరామ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు రూ.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాడు. అయితే సిద్ శ్రీరామ్ ఎక్కువగా మెలోడీలు, స్లో సాంగ్స్ మాత్రమే పాడగలడు అనే విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు.
చాలా మంది సంగీత దర్శకులు కూడా అతను పాట పాడే తీరుపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘స్కంద’ సినిమాలో ‘నీ చుట్టు చుట్టు’ అనే పాటని గమనిస్తే సిద్ లో మార్పు కనిపిస్తుంది. ఇది పక్కా ఫాస్ట్ బీట్ సాంగ్. రామ్, శ్రీలీల మధ్య వచ్చే సాంగ్ ఇది. వాళ్ళ డాన్స్ లతో ఈ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ చేకూరినట్టు అయ్యింది. సంగీత దర్శకుడు తమన్.. సిద్ శ్రీరామ్ లో కొత్త యాంగిల్ ను బయటపెట్టినట్లు అయ్యింది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?