‘ ట్విట్టర్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు.అందులో నిజం ఉంటే కామ్ గా ఉండొచ్చు. కానీ నిజం లేనప్పుడు భరిస్తూ కూర్చోలేను. అందుకే ట్విట్టర్లో ఎక్కువగా నేను రిప్లై లు ఇస్తూ ఉంటాను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ వేస్తూ ఉంటారు. నా పాటలు రిలీజ్ అయితే … పలానా పాట నుండీ ట్యూన్ లేపేశాను అంటూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి.. జనాలకి ఇవి అర్థమవుతున్నాయి. నిజానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా హ్యాపీగా కాపీ కొట్టుకునే వారు.
అప్పుడు ఎవ్వరికీ తెలిసేది కాదు. అలా అని కాపీ కొట్టుకోవచ్చు అని నేను అనడం లేదు. అప్పుడు బయటపడలేదు అంటున్నా ‘ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తమన్ చెప్పుకొచ్చిన మాటలివి. వరుసగా పెద్ద పెద్ద సినిమాలకి సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు తమన్.ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకేసారి ఏకంగా 13 సినిమాలకి సంగీతం అందిస్తుండడం మామూలు విషయం కాదు. అయితే తమన్ అందించే ట్యూన్ ల పై కాపీ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయి.
మరే మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్ చేయని ట్రోలింగ్ తమన్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అయితే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ల పై తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అందులో నిజానిజాల గురించి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.తమన్ చాలా మంది సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. మరి ఎవరి గురించి ఈ ఆరోపణలు చేశాడో..!