మీరంటే నాకు ఎప్పటికీ ఇష్టమే సార్ : పూరి జగన్నాథ్

మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకని మే 1 న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఇది మహేష్ 25 వ చిత్రం కావడంతో తన స్పీచ్ లో ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు తన సినీ జీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోయిన చిత్రాలు గురించి మహేష్ గుర్తుచేసుకున్నాడు. ఆ డైరెక్టరులందరికీ స్పెషల్ థాంక్స్ కూడా చెప్పాడు. అయితే తనకి ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ పేరుని చెప్పడం మరిచిపోయాడు.

దీంతో సాధారణ ప్రేక్షకులే కాదు మహేశ్ అభిమానులు కూడా నిరాశకి గురయ్యారు. కానీ వెంటనే మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘నేను నా స్పీచ్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా 25 సినిమాల జర్నీలో ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. ‘పోకిరి’ సినిమాను చేసిన పూరి జగన్నాథ్‌ గారికి థాంక్స్. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమది’’ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు మహేష్. ఇక ఈ ట్వీట్‌ పై పూరి సంతోషం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చాడు. ‘‘చాలా థాంక్స్ సార్.. ఎప్పటికీ మీరంటే నాకు చాలా ఇష్టం. మహర్షి ట్రైలర్ అదిరిపోయింది’’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు. అంతేకాదు మన ‘ఆర్‌.ఎక్స్ 100’ హీరో కార్తికేయ కూడా ఈ ట్వీట్‌ పై స్పందించాడు. ‘‘పోకిరి మాకు ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ సార్’’ అంటూ కార్తికేయ రిప్లై ఇవ్వడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus