తరుణ్ భాస్కర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

‘మీటూ’ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది హీరోయిన్లు.. అలాగే చిన్న చిన్న పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మీడియాతోనూ.. అలాగే సోషల్ మీడియాతోనూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా, ప్రముఖ సింగర్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, శృతీ హరిహరన్.. ఇలా చాలా మంది… తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చాడు. తెలుగులో అయితే ‘క్యాస్టింగ్ కౌచ్’ పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

Tharun Bhascker Actress Shocking Comments1

మొత్తానికి ‘మీటూ’ ఉద్యమం ముగిసింది అనుకునే టైంలో.. ఎవరో ఒకరు మళ్ళీ రేపుతూనే వస్తున్నారు. ఇప్పుడు ‘మీకు మాత్రమే చెబుతా’ హీరోయిన్ వాణి భోజన్ కూడా..తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ‘గతంలో నేను సినిమాలో ఆఫర్ కోసం ఓ నిర్మాతను కలిసాను. అవకాశం కావాలంటే నన్ను తన బెడ్రూమ్‌కు రమ్మన్నాడు. నా షూటింగ్.. డేట్స్ వంటి వ్యవహారాలు నా మేనేజర్ చూసుకుంటాడు. అతనివద్ద కూడా.. ‘మీ మేడమ్‌కి అవకాశమివ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలని’ చెప్పేవారట. మరికొందరైతే… ‘పడగ్గదికొస్తుందా చెప్పు.. ఇప్పుడే సినిమా ఫిక్స్ చేసేద్దాం’ అని కామెంట్స్ చేసేవారు” అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనని ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ నిర్మాత ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus