ENE 2: భయాన్ని బయటపెట్టిన తరుణ్ భాస్కర్ – Filmy Focus

ఒక దర్శకుడికి తన అతిపెద్ద హిట్టే, అతిపెద్ద శత్రువుగా మారడం అంటే ఇదేనేమో. ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాతో కల్ట్ క్లాసిక్ అందించిన తరుణ్ భాస్కర్, ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ, ‘ENE 2’ ఆలోచనే తనకు నిజమైన టెన్షన్ ఇస్తోందని ఒప్పుకున్నాడు. ఇది స్క్రిప్ట్ గురించిన టెన్షన్ కాదు, ఆ సినిమాపై ఫ్యాన్స్ పెంచుకున్న ప్రేమ గురించిన భయం.

ENE 2

తరుణ్ భాస్కర్ నిజాయితీగా ఒక మాట ఒప్పుకున్నాడు. ‘ENE 2’ అనౌన్స్ చేస్తే “ఈజీగా అడ్వాన్సులు” వస్తాయని, డబ్బుల కోసం అయితే ఎప్పుడో ఆ పని చేసేవాడినని, కానీ కేవలం డబ్బు కోసం ఆ సినిమాను తీయకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పాడు. ‘ENE’ ఇప్పుడు రెండు వైపులా పదునున్న కత్తిలా మారిందని, దాన్ని డీల్ చేయడం చాలా కష్టంగా ఉందని ఆయన అన్నారు.

ఈ భయానికి, రిగ్రెట్‌కు కారణం ఏంటో కూడా తరుణ్ చెప్పాడు. ఈ మధ్య థియేటర్లలో సినిమాను మళ్లీ చూసినప్పుడు, ఫ్యాన్స్ ప్రతీ డైలాగ్‌ను తనకంటే ముందుగా, అరిచి మరీ చెప్తున్నారట. ఆ సీన్ చూసినప్పుడు, “ఇది ఇక నా సినిమా కాదు, ఇది అందరి సినిమా” అని తనకు అర్థమైపోయిందని అన్నాడు. ఇది ఒక దర్శకుడిగా గర్వపడాల్సిన విషయమే అయినా, అదే ఇప్పుడు ఆయనకు అతిపెద్ద భయంగా మారింది.

ఇంతలా జనాల గుండెల్లోకి వెళ్లిపోయిన ఒక సినిమాకు సీక్వెల్ తీయడం అంటే మాటలు కాదు. “ప్రేక్షకులకు అంతగా నచ్చేసిన దాన్ని మించి ఇప్పుడు ఏం తీయగలం?” అనే ఒత్తిడి తనపై తీవ్రంగా ఉందని తరుణ్ పరోక్షంగా చెప్పాడు. ఆ కల్ట్ క్లాసిక్‌ను టచ్ చేసి, ఒకవేళ అది తేడా కొడితే ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోతానేమోనన్న భయమే ఆయనను వెనక్కి లాగుతోంది.

బహుశా ఈ డైరెక్షన్ టెన్షన్ నుంచే కాస్త బ్రేక్ తీసుకోవాలనుకున్నాడేమో, తరుణ్ భాస్కర్ ఇప్పుడు యాక్టింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. మలయాళ హిట్ ‘జయ జయ జయ జయ హే’ తెలుగు రీమేక్ అయిన ‘ఓం శాంతి శాంతి శాంతి’లో ఆయన హీరోగా నటిస్తున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags