బిగ్ బాస్4 : ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

  • October 23, 2020 / 12:28 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో 7వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. నోయల్ డైరెక్టర్ గా లాస్ట్ వీక్ నామినేట్ అయితే, అభిజిత్ – దివి – అరియనా – మోనాల్ – అవినాష్ లు రంగుపడింది ప్రక్రియ ద్వారా నామినేట్ అయ్యారు. ఇక్కడ మనం చూసినట్లయితే అరియనాకి ఈవారం బాగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. తన ఓటింగ్ గ్రాఫ్ ని పెంచుకుంది. అందుకే సేఫ్ జోన్ లోకి వెళ్లింది.

అలాగే, ఫస్ట్ నుంచి అభిజిత్ కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ తో తను కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. అయితే, ఇక్కడ ఫస్ట్ టైమ్ వచ్చిన అవినాష్ కూడా ఓట్లు బాగానే లాగాడు. మరోవైపు దివి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంటూనే ఉంది.

ఇక మిగిలింది మోనాల్ అండ్ నోయల్. లాస్ట్ వీక్ కూడా వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే, అనూహ్యంగా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. దానికి సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఇక ఈవారం కూడా వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు.

ఇప్పుడు అసలు ఎలిమినేషన్ అనేది జరుగుతుందా.. లేదా దసరా వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ అనేది లేకుండా చేస్తారా అనేది పాయింట్. పండగ పూట అని చెప్పి ఎవర్నీ ఎలిమినేట్ చేయకుండా అందర్నీ సేఫ్ చేస్తే మాత్రం ఈసారి వీరిద్దరూ బతికిపోతారు. లేదంటే మాత్రం ఇద్దరిలో ఒకరు బ్యాగ్ సర్ధుకోవాల్సిందే.

అయితే ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. నాగార్జున యాంకరింగ్ చేయకుండా వేరే సెలబ్రిటీ ఎవరన్నా ఇంట్లోకి వచ్చినా కూడా ఎలిమినేషన్ సస్పెన్స్ అనేది కంటిన్యూ చేస్తారు. ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదని చెప్పి హౌస్ మేట్స్ ని కాస్త టెన్షన్ పెడతారు.

ఈ విజయదశమికి బిగ్ బాస్ హౌస్ లోకి విజయ్ దేవరకొండ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా హౌస్ మేట్స్ తో గేమ్ ఆడుకుంటాడు విజయ్. మరి చూద్దాం.. ఈవారం ఎంటర్ టైన్మెంట్ ఎలా ఉండబోతోంది అనేది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus