బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో రెండోవారం నామినేషన్స్ లో ఏకంగా 11మంది ఉన్నారు. ఇందులో 7గురు సీనియర్స్ ఉంటే, 4గురు జూనియర్స్ ఉన్నారు. అయితే, డేంజర్ జోన్ లో మాత్రం ముగ్గురు కనిపిస్తున్నారు. వీరిలో అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, ఇంకా శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, ఇంకా మహేష్ విట్టాలు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అయితే, స్మగ్లర్స్ టాస్క్ లో పెర్ఫామెన్స్ చేసిన వీరిద్దరికీ కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది.
అఖిల్ టాప్ ప్లేస్ లో ఉంటే అరియానా అఖిల్ కి టఫ్ ఫైట్ ఇస్తోంది. ఇంకో మేటర్ ఏంటంటే యాంకర్ శివ కూడా వీరిద్దరికీ ఫైట్ బాగా ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న శివకి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది బాగా పడుతోంది. బిందుమాధవితో ఫ్రెండ్షిప్ వల్ల కూడా బిందుమాధవి ఫ్యాన్స్ ఓట్లు కూడా ఎక్కువగానే పడుతున్నాయి. మరోవైపు షణ్ముక్ జస్వంత్ ఫాలోవర్స్ కూడా యాంకర్ శివని అభిమానిస్తూ ఓట్లు వేస్తున్నారు.
దీంతో యాంకర్ శివ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. రెండోవారం నామినేషన్స్ లో సీనియర్స్ నుంచీ ఎవరైనా ఎలిమినేట్ అవుతారా లేదా జూనియర్స్ నుంచీ ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ముగ్గురు జూనియర్స్ ఉన్నారు. అలాగే, నటరాజ్ మాస్టర్ ఇంకా మహేష్ విట్టాలు కూడా కొద్దిగా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.
ఇప్పటివరకూ జరిగిన అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే గనక, శ్రీరాపాక ఇంకా మిత్రాశర్మ లు లీస్ట్ లో ఉన్నారు. ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే వీరిద్దరిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.