Actor: ఏ క్యారెక్టర్ అయినా జీవించే నటుడు అతడే..!

  • April 25, 2023 / 04:54 PM IST

పాత్ర ఏదైనా.. హీరో అయినా, విలనైనా, కమెడియన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. ఏదైనా సరే అతడు చేయనంత వరకే. ఒక్కసారి బ్రహ్మాజీ కమిట్ అయ్యాడో..ఏ పాత్రలోనైనా ఒదికిపోతాడు.. ఆల్‌రౌండర్‌ అంటే అన్నింటిలోనూ ప్రతిభ కలిగి ఉండటం. అలాంటి ఆల్‌రౌండర్‌కు చక్కటి నిదర్శనం బ్రహ్మాజీ. క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ అన్నింటిలో ప్రతిభ కలిగిన ఆటగాడిని ఆల్‌రౌండర్ అంటారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే సరికి హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్.. ఇలా అన్ని తరహా పాత్రలు చేయగలిగిన నటుడిని ఆల్‌రౌండర్ అంటారు.

ఆ లెక్కన నటుడు బ్రహ్మాజీ (Actor) పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఆ పాత్ర పీక్ స్టేజ్‌కి వెళ్లేవరకు, ఆ పాత్రకు పిచ్చెక్కించే వరకు దానంతు చూడకుండా వదలడు. దటీజ్ బ్రహ్మాజీ. ఒక్క నటనే కాదు.. ముక్కుసూటితనం ఆయన నైజం. అందరూ వామ్మో.. వాయ్యో అని భయపడే చోట కూడా.. బ్రహ్మాజీ దూసుకెళ్లిపోతాడు. అందుకు నిదర్శనం ఇటీవల అనసూయ, రోజా వంటి వారి విషయంలో ఆయన వేసిన ట్వీట్సే. సోషల్ మీడియా ని బ్రహ్మాజీ వాడినంతగా మరెవ్వరూ వాడరేమో.

కుర్ర హీరోహీరోయిన్లపై కూడా సెటైర్లు పేల్చి కామెడీని పుట్టించగల సమర్థుడు బ్రహ్మాజీ. అందుకే ఆయన అంతగా ఫేమస్ అవుతున్నారు. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అనే భేదం బ్రహ్మాజీకి అసలు ఉండదు. తన చెంతకు వచ్చిన పాత్రకు పర్ఫెక్ట్‌గా న్యాయం చేశానా? లేదా? ఇదే బ్రహ్మాజీ ఆలోచించేది. అందుకే సినిమాలు ఆడకపోయినా.. ఆయన పాత్రకి సంబంధించి మాత్రం ఎప్పుడూ పాజిటివ్ టాకే వస్తుంది. ‘అతడు’ సినిమాలో అప్పటి వరకు సీరియస్‌గా నడిచిన సినిమా.. ఒక్కసారి బ్రహ్మాజీ కనబడగానే దాని స్వరూపమే మారిపోతుంది.

ఇలా ఒక్కటేమిటి.. బ్రహ్మాజీ వేసే ప్రతి పాత్ర ప్రేక్షకులని అలరిస్తుంది. ఆయన పాత్ర విషయంలో దర్శకులు 50 శాతం అనుకున్న సీన్‌ని.. 100 శాతానికి తీసుకురాగలిగిన నటినాపటిమ బ్రహ్మాజీ నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఈ రోజు (ఏప్రిల్ 25) బ్రహ్మాజీ బర్త్ డే.. కానీ బర్త్ డేలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. కానీ ఆయన మాత్రం ఇంకా మన్మథుడిలా అలానే యంగ్‌గా కనిపిస్తుంటారు. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు చాలా మంది బ్రహ్మాజీని చూసి కుళ్లుకుంటూ ఉంటారు.

వాళ్ల అబ్బాయి కూడా హీరో అయ్యాడు. కానీ బ్రహ్మాజీకి అంత కొడుకు ఉన్నాడా? అంటే ఎవరూ నమ్మరుకాక నమ్మరు. అంతలా బ్రహ్మాజీ తన ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తుంటాడు. దీనికి ఆయన చేసేది ఏమిటో తెలుసా? తను నవ్వుతూ.. నలుగురిని నవ్విస్తూ ఉండటమే. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ.. సోషల్ మీడియాలో సెటైరికల్ సమాధానాలతో అలరిస్తూ.. సినిమాలలో తన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ.. హాయిగా సాగిపోతున్న బ్రహ్మాజీ జీవన ప్రయాణం ఇలానే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ.. బ్రహ్మాజీ హ్యాపీ బర్త్ డే..

</ifram

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus