Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

ఎన్నో రోజుల వెయిటింగ్‌ తర్వాత నాగార్జున వందో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. ఒకరిద్దరు దర్శకుల పేర్లు వినిపించినా.. ఆఖరికి రా.కార్తిక్‌ దర్శకత్వంలోనే ఈ సినిమా మొదలైంది. షూటింగ్‌ గత కొన్ని రోజులుగా జరుగుతున్నా సినిమా కాస్టింగ్‌ గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని మాత్రం చెప్పుకొచ్చారు. ఇద్దరు సీనియర్‌ నాయికలు కాగా, ఒకరు జూనియర్‌ నాయిక అని రూమర్‌ బయటకు వచ్చింది. దానికి కారణం ఈ సినిమాలో నాగార్జున మూడు పాత్రల్లో కనిపిస్తారు అనే మాట బయటకు రావడమే.

Nagarjuna

‘కింగ్‌ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాదాపు అదే పేరు పెడతారు అనే మాట కూడా వినిపిస్తోంది. దానికి ఓ కారణం కూడా ఉంది. అది సినిమాలోనే చూడాలి అని కూడా అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇందులో ఓ సీనియర్‌ హీరోయిన్‌ టబును కాస్టింగ్‌ చేశారని సమాచారం. నాగార్జున – టబు మధ్య ఉన్న అనుబంధం కారణంగా ఆమె ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు యంగ్‌ నాగార్జున సరసన నాయికగా ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేశారు అని చెబుతున్నారు. త్వరలోనే ఆమె సెట్స్‌లో అడుగుపెట్టొచ్చని సమాచారం.

ప్రస్తుతానికి గ్లామర్‌ పాత్రలకు ఆమడ దూరంలో ఉన్న ఐశ్వర్య రాజేశ్‌.. ఈ సినిమాలో కూడా అదే ఆలోచన ధోరణికి తగ్గట్టుగానే నటిస్తోందని సమాచారం. ఇక మూడో హీరోయిన్‌ పాత్ర కోసం ‘నాట్యం’ సినిమా నటి సుస్మితా భట్‌ను తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ సినిమా విషయాలేవీ ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు కాబట్టి.. ఈ విషయాలు కూడా బయటకు రాకపోవచ్చు. నాగార్జున ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్నారో తేలితే అప్పుడు ప్రచారం షురూ చేస్తారు. అప్పుడే సినిమా అప్‌డేట్‌లు బయటకు వస్తాయి.

తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus