బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఈవారం 8మంది నామినేషన్స్ లో ఉన్నారు. మైయిన్ ప్లేయర్స్ కాకుండా మిగతా వాళ్లు అందరూ ఉండటంతో ఓటింగ్ లో కూడా కన్పూజన్ అనేది క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూస్తే యావర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అమర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. బోలే ధర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ సేఫ్ అవుతాడా లేదా అనేది మాత్రం చూడాలి.
అలాగే, మిగతా ఐదుగురులో ప్రియాంక కూడా సేఫ్ జోన్ లోనే ఉంది. మిగిలిన నలుగురే డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లలో అర్జున్ – తేజ – శోభాశెట్టి – రతిక ఉన్నారు. ఈవారం బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే, డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. అలా చేస్తే ఒక మేల్ కంటెస్టెంట్, ఇంకో ఫిమేల్ కంటెస్టెంట్ వెళ్లి పోయే ఛాన్స్ కనిపిస్తోంది. వీళ్ల నలుగురిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. ఈవారం శోభాశెట్టి కెప్టెన్ అయ్యింది కాబట్టి, బిగ్ బాస్ ఇమ్యూనిటీ ఇస్తే ఖచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది.
కానీ, బిగ్ బాస్ ఈవారం ఇమ్యూనిటీ ఇవ్వకుండా ఓన్లీ నెక్ట్స్ వీక్ మాత్రమే ఉంటే కెప్టెన్సీ తో పాటుగా ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఈవారం ఓటింగ్ పోల్స్ మొదలైనప్పటి నుంచీ శోభాశెట్టి – తేజ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. చాలామంది వీళ్లిద్దరిలో ఒకరు వెళ్లిపోతారని కూడా అన్నారు. కానీ , ఇప్పుడు కెప్టెన్ అయ్యాక పరిస్థితి మారింది. అలాగే, టాస్క్ లో తేజ పెర్ఫామన్స్ కి ఓట్లు బాగా పడ్డాయి. దీంతో అర్జున్ – రతిక ఇద్దరూ డేంజర్ జోన్ కి వచ్చారు.
అలాగే, బోలే షవాలి కూడా సేఫ్ అని చెప్పలేం ఎందుకంటే, అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో భోలేకి బ్రహ్మాండంగా ఓటింగ్ పడుతున్నా కూడా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం గేమ్ పరంగా ఎలాంటి ముందంజ లేదు. అందుకే మ్యాగ్జిమమ్ అతడ్ని పంపించేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయ్. అలా చేస్తే ఖచ్చితంగా భోలే షవాలి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే తేజ లేదా రతిక ఇద్దరిలో ఒకరు అవుట్ అవ్వచ్చు. మరి ఈవారం (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి.