Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఈవారం ఇస్తున్న ట్విస్ట్ ఏంటి ? ఆమె కోసం ఎవర్ని బలి చేస్తున్నారంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం ఎలిమినేషన్ అనేది రసవత్తరంగా ఉండబోతోంది. ప్రస్తుతం నామినేషన్స్ లో 7గురు ఉన్నారు. ఈ 7గురు లో నుంచీ డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. అలా కాకుండా పండగ పూట ఎలిమినేషన్ తీసేస్తే అందరూ సేఫ్ అవుతారు. మరి బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో పోలింగ్ మనం చూసినట్లయితే., పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

దాదాపుగా 45 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరిగింది. సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఈవారం శివాజీ, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో లేకపోవడం అనేది పల్లవి ప్రశాంత్ కి బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత అమర్ దీప్ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అమర్ దీప్ కి కూడా ఓటింగ్ అనేది నిలకడగానే జరిగింది. సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. వీరిద్దరూ తప్పితే మిగతా ఐదుగురు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. గౌతమ్, భోలే, తేజ, అశ్విని , ఇంకా పూజ ఈ 5గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయితే, అన్ అఫీషియల్ సైట్స్ లో మాత్రం అశ్విని, ఇంకా పూజా ఈ ఇద్దరే లీస్ట్ లో ఉన్నారు. ఇద్దరూ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా పోటుగాళ్ల టీమ్ లోకి వచ్చిన వాళ్లే. అయితే, ఇద్దరూ ఫిమేల్ కంటెస్టెంట్స్ కాబట్టి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక్కసారి ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే., వరుసగా బిగ్ బాస్ హౌస్ లో ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, తర్వాత షకీల, థామిని, రతిక, శుభశ్రీ, నయనీ పావని ఇలా అందరూ కూడా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

ఇప్పుడు 7వ వారం కూడా ఫిమేల్ ని ఎలిమినేట్ చేయరు. అందుకే ఆమె కోసం ఎవరిని బలి చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. భోలే షవాలి, గౌతమ్ కృష్ణ, తేజ ఈ ముగ్గురులో ఒకరు వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎపిసోడ్ పరంగా చూస్తే తేజకోసం కేక్ కూడా పంపాడు బిగ్ బాస్. శోభా పేరు రాశాడు. ముందుంది ముసళ్ల పండగ అని కూడా చెప్పాడు. అలాగే తేజకి ఈవారం ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా కల్పించాడు.

దీన్ని బట్టీ చూస్తే తేజని ఎలిమినేట్ చేయబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయ్. ఒకవేళ తేజని సేఫ్ చేస్తే ఖచ్చితంగా భోలే షవాలిని పంపించేస్తారు. కంటెంట్ పరంగా మనోడు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే బోటమ్ లో ఉన్న వాళ్లని చేయాలంటే పూజమూర్తిని ఎలిమినేట్ చేస్తారు. ఇలా ఇన్ని ఆప్షన్స్ మద్యలో ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనేది బిగ్ బాస్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. మరి చూద్దాం… (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి అనేది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus