Bigg Boss 7 Telugu: హౌస్ మొత్తం షేక్..! నాగార్జున రాక్..! ఆడియన్స్ షేక్..!

బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా శోభాశెట్టిని యావర్ ని పిచ్చోడు అన్నందుకు ఒక ఆట ఆడుకున్నారు. గతవారం నిన్ను ఎర్రగడ్డ అన్నందుకు తెగ ఫీల్ అయ్యావ్ ? ఇప్పుడు నువ్వు చేసిందేంటి అని ఫుల్ క్లాస్ పీకారు. అలాగే అమర్ ఫ్లాగ్ ని పట్టుకుని ఏం చేద్దాం అని అడిగితే, ఈసారికి వదిలేద్దాం అని, తప్పు జరగకుండా చూస్కుంటానని శోభా చెప్పింది. కానీ, ప్రియాంక ఇదే క్వశ్చన్ కి బ్రేక్ చేద్దాం అని చెప్పింది.

దీంతో సేఫ్ గేమ్ ఆడుతోంది ఎవరో తెలుస్తోందా అంటు శోభకి క్లాస్ తీస్కున్నారు. అలాగే, అమర్ ని అయితే గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు వేశారు. ప్రశాంత్ ని నా కొడకా అన్నావ్, పగిలిపోద్ది అన్నావ్ అదే సందీప్ ని – అర్జున్ ని ఎందుకు అనలేదు. వాళ్లు కూడా మద్యలో వచ్చారు కదా అంటూ నిలదీశారు. దీంతో అమర్ కి ఆన్సర్ లేకుండా పోయింది. తర్వాత రతిక ని హౌస్ లోకి కబుర్లు చెప్పడానికి రీ ఎంట్రీ ఇచ్చావా ? గేమ్ ఆడటానికి వచ్చావా ? అంటూ అడిగారు.

దీనికి రతిక పాతవిషయాలు గుర్తు చేస్తున్నారు అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పింది. దీంతో నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. తర్వాత ఆట సందీప్ కి అద్దిరిపోయేలా కౌంటర్ వేశారు. బొంగులో డ్యాన్సర్ గురించి మాట్లాడదాం అంటూ సందీప్ మాస్టర్ ని లేపారు. నువ్వు డ్యాన్సర్ వా ? కొరియోగ్రాఫర్ వా ? అని స్ట్రయిట్ గా ప్రశ్నించాడు. దీంతో సందీప్ రెండూ అంటూ ఆన్సర్ ఇస్తే, బొంగులో ఆన్సర్ ఇవ్వకు సరిగ్గా చెప్పు అన్నారు. దీంతో సందీప్ మాస్టర్ కి సీన్ అర్ధమైంది.

బొంగు అంటే బూతు కాదు కదా, నువ్వే చెప్పావ్ కదా అందుకే నేను అంటున్నా అంటూ మాట్లాడారు. సందీప్ మాస్టర్ కి నోట మాట రాలేదు. ఆ తర్వాత శివాజీ వీడియోని సైతం చూపించారు. వాలంట్రీగా ఎవరో ఒకరిని కొట్టి వెళ్లిపోతా అంటూ శివాజీ మాట్లాడిన మాటలు వినిపించారు. ఎవర్ని కొడతావ్ ఎందుకు కొడతావ్ అని నిలదీశారు. దీంతో శివాజీ చాలా బాధేస్తోంది. వీళ్లు అనే మాటలు చాలా వరెస్ట్ గా ఉన్నాయ్ ? అన్నీ నేను చెప్పలేను సార్ అని, మీరు నన్ను తిట్టినా పర్లేదు , ఇక్కడ్నుంచీ పంపించేసినా పర్లేదని శివాజీ మాట్లాడాడు.

ఇక ఈవారం ఎలిమినేషన్ అనేది చాలా ఉత్కంఠంగా జరిగింది. శోభాశెట్టి, సందీప్ మాస్టర్ మద్యలో ఎలిమినేషన్ జరిగింది. ఇద్దరిలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ మొత్తం షాక్ అయ్యింది. సందీప్ మాస్టర్ గేమ్ ఫస్ట్ నుంచీ కూడా హౌస్ మేట్స్ మెచ్చుకుంటూ వస్తున్నారు. కానీ, ఇంతకాలం నామినేషన్స్ లోకి రాకుండా మాస్టర్ జాగ్రత్త పడ్డారు.

సందీప్ మాస్టర్ కి అలా కలిసొచ్చింది. అయితే, ఫస్ట్ టైమ్ నామినేషన్స లోకి రాగానే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజానికి శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని చాలామంది ఆడియన్స్ భావించారు. కానీ, ఈవారం సేఫ్ అయ్యింది. సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ తో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇలా నాగార్జున (Bigg Boss 7 Telugu) ఈవారం హోస్టింగ్ తో హౌస్ ని షేక్ చేశాడు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags