Bigg Boss 7 Telugu: 3వ వారం హౌస్ నుంచీ వెళ్లిపోయేది ఎవరంటే., తెలిస్తే షాక్ అయిపోతారు..!

  • September 22, 2023 / 10:49 AM IST

బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలకి , కొట్లాటలకి నెలవు. అందులో నామినేషన్స్ అంటే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రెచ్చిపోతుంటారు. ఇక నామినేషన్స్ అప్పుడు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో ఆడుకుంటారు. అయితే, ఇప్పుడు సీజన్ 7లో మూడోవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్. ఈవారం నామినేషన్స్ లో చూస్తే మొత్తం ఏడుగురు ఉన్నారు. 4 అమ్మాయిలు, 3 అబ్బాయిలు ఉన్నారు. అయితే, గత రెండు వారాలుగా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.

ఇప్పుడు మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే మాత్రం మాజా వస్తుంది. అందుకే, షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా అయితే, ప్రిన్స్ యావార్ ఇంకా గౌతమ్ కృష్ణ ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ప్రకారం చూస్తే థామిని ఇంకా శుభశ్రీ ఈ ఇద్దరూ కూడా బోటమ్ లో ఉన్నారు. అలాగే రతిక ఇంకా ప్రియాంకలు కూడా వెనకబడి ఉన్నారు.

దీనిని బట్టీ చూస్తే ఈ నలుగురు అమ్మాయిల్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చని కూడా అంటున్నారు. అయితే, అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో ఓటింగ్ లో ఆర్డర్ చూసినట్లయితే., ఫస్ట్ ప్లేస్ లో అమర్ దీప్ ఉన్నాడు, తర్వాత ప్లేస్ లో గౌతమ్ , ప్రిన్స్ లు ఉన్నారు. మిగతా నలుగురు అమ్మాయిలు కూడా మిగతా పర్సెంటేజ్ ఓట్లని పంచుకున్నారు. అయితే అందరికన్నా కూడా థామినీ కి తక్కువగా ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టీ చూస్తే ఈవారం థామినీ ఎలిమినేట్ అవ్వాల్సిందే.

అయితే, గత రెండు వారాలుగా కిరణ్ రాథోడ్, ఇంకా షకీల ఇద్దరూ కూడా ఫిమేల్ కంటెస్టెంట్స్ వెళ్లిపోయారు. మేల్ కంటెస్టెంట్ ఒక్కరూ కూడా వెళ్లలేదు. అలాగే, బిగ్ బాస్ లో ఎప్పుడూ కూడా మూడోవారం ఒక షాకింగ్ ఎలిమినేషన్ అనేది పెడతారు. అందుకే, ఇప్పుడు మ్యాగ్జిమమ్ ప్రిన్స్ యావార్ ని ఇంటికి పంపించేస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ మూడో వారం ఎలిమినేషన్ అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇమ్యూనిటీ కోసం ప్రియంక, ప్రిన్స్ యావార్ లతో పాటుగా నామినేషన్స్ లో లేని శోభాశెట్టి కూడా పార్టిసిపేట్ చేస్తోంది. మరి వీళ్లలో ప్రియాంకకి ఇమ్యూనిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా శుభశ్రీ ఇంకా థామినీల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. మ్యాగ్జిమమ్ ఈవారం థామిని ఎలిమినేట్ అవ్వాల్సిందే అని బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఆడియన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. అదీ మేటర్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus