Bigg Boss 7 Telugu: టాస్క్ లో గెలిచింది వాళ్లే..! అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం వీరసింహాలు – గర్జించే పులులు టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఒక ఛాలెంజ్ లో ఆరెంజ్ టీమ్ ఇంకో ఛాలెంజ్ లో ఎల్లో టీమ్ గెలిచాయ్. ఆరెంజ్ టీమ్ ప్రశాంత్ ని డెడ్ చేస్తే, ఎల్లో టీమ్ ఆరెంజ్ టీమ్ నుంచీ 500 బాల్స్ లాక్కుని బిగ్ బాస్ కి పంపించారు. ఇలా ఇద్దరి పవర్స్ అయిపోయాక బిగ్ బాస్ తన పవర్ ని చూపించాడు. పార్టిసిపెంట్స్ కలెక్ట్ చేసిన బాల్స్ లో గోల్డెన్ బాల్, బ్లాక్ బాల్ రెండూ ఉన్నాయి.

ఈ రెండు బాల్స్ కూడా గౌతమ్ అండ్ టీమ్ దగ్గరే ఉన్నాయి. ఈ పవర్స్ ని ఉపయోగించి గౌతమ్ భోలే షవాలిని స్వాప్ చేసుకుని అర్జున్ ని తన టీమ్ లోకి తీస్కుని వచ్చాడు. అంతేకాదు, గేమ్ ఛేంజింగ్ బాల్ తో ఎల్లో టీమ్ బాల్స్ అన్నీ దక్కించుకుని టీమ్ ని విజేతగా నిలపెట్టాడు. దీంతో ఆరెంజ్ టీమ్ మెంబర్స్ అందరూ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. అర్జున్ – యావర్ – గౌతమ్ – రతిక – తేజ – ఇంకా శోభశెట్టి కెప్టెన్సీ రేస్ లో నిలబడ్డారు.

ఇక వీళ్లకి రెండు రౌండ్స్ కెప్టెన్సీ టాస్క్ నడిచాయ్. అర్జున్ – గౌతమ్ – యావర్ కెప్టెన్సీ రేస్ నుంచీ అవుట్ అయ్యారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురిలో శోభాశెట్టి కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈవారం శోభాశెట్టి డీప్ డేంజర్ జోన్ లో ఉంది. మరి కెప్టెన్ కాబట్టి ఈవారం కూడా ఇమ్యూనిటీ ఇస్తే సేప్ అవుతుంది. లేదంటే మాత్రం ఎలిమినేట్ అవుతుంది. ఇక బాల్స్ టాస్క్ లో హౌస్ మేట్స్ స్ట్రాటజీలు ఉపయోగించారు. గౌతమ్ రాత్రిపూట బాల్స్ ని కొట్టేయడానికి స్కెచ్ వేశాడు.

కానీ శివాజీ ఇది అన్ ఫైయిర్ గేమ్ అవుతుందని, దొంగతనం చేయద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడు. మరోవైపు బాల్స్ ని ఎక్కడ పడితే అక్కడ దాచేందుకు యావర్ – రతిక ప్రయత్నాలు చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన స్యాక్స్ లోనే పెట్టి వాటిని బాల్కనీలో ఉన్న బీమ్ బ్యాగ్స్ లో దాచారు. అలాగే వాటిలో బాల్స్ బదులు కూరగాయలు కూడా వేసి ఆపోజిట్ టీమ్ ని కన్ఫూజ్ చేశారు. దీంతో ఎవరూ కూడా బాల్స్ కొట్టేసేందుకు ఆసక్తిని చూపలేదు. అయితే, గౌతమ్ అండ్ టీమ్ అర్ధరాత్రి అర్జున్ వారి టీమ్ లోకి వచ్చాక ఆపోజిట్ టీమ్ బాల్స్ ఎక్కుడున్నాయో కనిపెట్టాడు.

దీంతో కొట్టేందామని ప్రయత్నం చేస్తే, నేను అక్కడే పారేస్తా తీస్కుంటే తీస్తో అంటూ శివాజీ తన మాటలతోనే మాయ చేశాడు. నువ్వు డాక్టర్ వి, నీ క్యారెక్టర్ ఏంటి చెప్పు, ఇలా బాల్స్ కొట్టేయడం కరెక్టేనా ? అంటూ హితబోధ చేశాడు. దీంతో గౌతమ్ విరమించుకున్నాడు. ఫైనల్ గా గౌతమ్ కి దొరికిన పవర్ బాల్స్ తోనే గేమ్ అనేది డిసైడ్ అయిపోయింది. దీంతో ఎల్లో టీమ్ చాలా బాగా ఆడినా కూడా గెలవలేకపోయారు. స్లోప్ టాస్క్ లో (Bigg Boss 7 Telugu) అమర్ ఫస్ట్ టైమ్ సోలోగా ఒక టాస్క్ గెలిచి రచ్చ రచ్చ చేశాడు. మొత్తానికి అదీ మేటర్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus