Ramya Krishna: రమ్యకృష్ణ తెలుగు ఇండస్ట్రీలోకి రావడానికి అదే కారణమా?

Advertisement

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రమ్యకృష్ణ ఒకరు. ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా సీనియర్ హీరోలు అందరి సరసన నటించిన రమ్యకృష్ణ ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రమ్యకృష్ణ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.గతంలో రమ్యకృష్ణ రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా రజనీకాంత్ కి జోడిగా ఈమె జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ…తాను తమిళంలో ఎన్నో సినిమాలు చేశాను అయితే ఆ సినిమాలేవి కూడా తాను ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయని ఈమె తెలిపారు.

అయితే తమిళంలో ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతోనే తాను తెలుగ చిత్ర పరిశ్రమ వైపు ఆసక్తి చూపుతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఇలా ఈమె తెలుగు చిత్ర పరిశ్రమ లోకి రావడానికి కారణాలు తెలుపుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ ఈమె తెలిపారు.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి (Ramya Krishna) రమ్యకృష్ణకు బాహుబలి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందించింది ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus