Allu Arjun: అల్లు అర్జున్ కు అచ్చొచ్చిన సెంటిమెంట్ ఇదే!

  • April 9, 2022 / 04:06 PM IST

ఈ నెల 8వ తేదీన బన్నీ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. వరుస విజయాలతో జోరుమీదున్న బన్నీ తర్వాత సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతో సినిమాల ఎంపిక విషయంలో బన్నీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఏప్రిల్ లో బన్నీ సినిమాను విడుదల చేస్తే ఆ సినిమా హిట్టేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ లో బన్నీ నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా ఆ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. 2005 సంవత్సరం ఏప్రిల్ లో బన్నీ హీరోగా నటించిన “బన్నీ” సినిమా థియేటర్లలో విడుదల కాగా ఆ తర్వాత 2014 సంవత్సరం ఏప్రిల్ లో బన్నీ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమా విడుదలైంది. 2015 సంవత్సరం ఏప్రిల్ లో సన్నాఫ్ సత్యమూర్తి విడుదల కాగా 2016 సంవత్సరం ఏప్రిల్ లో సరైనోడు సినిమా విడుదలైంది. ఈ నాలుగు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.

భవిష్యత్తులో కూడా బన్నీ నటించిన సినిమాలు ఏప్రిల్ లో రిలీజ్ అవుతాయేమో చూడాల్సి ఉంది. సమ్మర్ లో వేసవి సెలవులు కూడా కలిసొస్తుండటంతో సమ్మర్ లో రిలీజ్ చేసిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. పుష్ప2 సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

పుష్ప2 సినిమా ఎప్పుడు విడుదలైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండా బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించారు. పుష్ప2 సినిమాతో బన్నీ మరో పాన్ ఇండియా హిట్ ను ఖాతాలో వేసుకుంటున్నారు. పుష్ప2 సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus