Macherla Niyojakavargam: నాని, సాయి ధరమ్ తేజ్, రవితేజ.. అందరికీ దెబ్బ పడింది.. నితిన్ సంగతేంటి?

  • August 12, 2022 / 12:10 AM IST

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు, ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో పబ్లిక్ సర్వెంట్ అయిపోయి జనాలకి న్యాయం, సాయం చేస్తుంటే… కొత్త రకం హీరోయిజాన్ని చూపించినట్టు దర్శకులు భావిస్తున్నారు. నిజానికి ఇలాంటి హీరోయిజం గతంలో చాలా సినిమాల్లో చూశాం. ‘కలెక్టర్ గారు’ లో మోహన్ బాబు ఇలాంటి పాత్రనే పోషించారు. ఇప్పుడు రాంచరణ్ కూడా శంకర్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో అలాంటి పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ఇప్పుడు చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు ఇలాంటి పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం వల్ల మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరవ్వొచ్చు అనేది వారి అభిప్రాయం కావచ్చు. రేపు(ఆగస్టు 12న) విడుదల కాబోయే ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో నితిన్ ఐ.ఎ.ఎస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడ ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ వస్తుంది. మిడ్ రేంజ్ హీరోలకు ఇలాంటి పాత్రలు కలిసి రావడం లేదు. గత ఏడాది కనుక చూసుకుంటే.. ‘రిపబ్లిక్’ సినిమాలో సాయి తేజ్.. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా కనిపించాడు.

ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే ‘కొండ పొలం’ సినిమాలో వైష్ణవ్ తేజ్.. ఐ.ఎఫ్.ఎస్ ఉద్యోగిగా కనిపించాడు. ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు. అలాగే ‘టక్ జగదీష్’ లో నాని ఎం.ఆర్.ఓ గా కనిపిస్తే, ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో రవితేజ ఐ.ఏ.ఎస్.ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘మాచర్ల..’ లో నితిన్ కూడా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మరి నితిన్ కు ఈ సినిమా ఎంత వరకు కలిసొస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. నితిన్ హిట్ కొట్టి ఆ ఫ్లాప్ సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి..!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus