Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ వెర్షన్లో ఈ ఆ సీన్ డిలీట్ చేసేశారు..!

Ad not loaded.

మెగా పవర్ స్టార్ రాంచరణ్  (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. దర్శకుడు శంకర్  (Shankar) టేకింగ్ 1990 ..ల దగ్గరే స్ట్రక్ అయిపోయింది అంటూ అంతా పెదవి విరిచారు. మెగా అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. వాళ్ళని అలరించలేకపోయింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Game Changer

2025 సంక్రాంతికి ఫస్ట్ ఛాయిస్ అనుకున్న ఈ సినిమా లాస్ట్ ఆప్షన్ అయ్యింది. అన్నీ ఎలా ఉన్నా.. ఈ సినిమా రిలీజ్ టైంలో జరిగిన ట్రోలింగ్ ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా క్లైమాక్స్ ఫైట్ లో రాంచరణ్.. విలన్ ఎస్.జె.సూర్య (SJ Surya) వైపు చూసి వెకిలిగా నవ్వే సీన్ ఒకటి ఉంటుంది. దాన్ని యాంటీ ఫ్యాన్స్ ఏకిపారేశారు. అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకి కూడా ఆ సీన్ అడ్వాంటేజ్ గా మారిపోయింది ని చెప్పాలి.

అయితే ఫిబ్రవరి 7న ‘గేమ్ ఛేంజర్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు .. ఓటీటీలో చూడడానికి రెడీ అయ్యారు. థియేటర్లలో చూసిన అభిమానులు కూడా ‘గేమ్ ఛేంజర్’ ని మళ్ళీ వీక్షించినట్టు ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు క్లైమాక్స్ లో వచ్చే సీన్ ను డిలీట్ చేసినట్లు గుర్తించారు. అవును రిలీజ్ టైంలో చరణ్ ని ట్రోల్ చేసిన వీడియో.. ఓటీటీ వెర్షన్లో లేదు. ఆన్లైన్ ట్రోల్స్ ని అవాయిడ్ చేయడానికే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అని స్పష్టమవుతుంది.

అగ్ర దర్శకుల్ని వదలని నిర్మాతలు.. నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus