#RC15: శంకర్ మెగా యాక్షన్ ఎపిసోడ్!

సంచలన దర్శకుడు శంకర్ మొదటిసారి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ అంశాలతోపాటు న్యాయ వ్యవస్థపై కూడా సరి కొత్త అంశాలను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కమర్షియల్ గా ఉండే అన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా శంకర్ సినిమాలో ఫైట్స్ ఏ తరహాలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథకు అవసరానికి తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసి శంకర్ భారీ విజువల్ ట్రీట్ ఇస్తారు. రామ్ చరణ్ తో కూడా ఈసారి అంతకుమించి అనేలా యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఒక ట్రైన్ ఫైట్ అద్భుతంగా ఉంటుందట. గతంలో రామ్ చరణ్ చేసిన ఫైట్ సీన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా శంకర్ తన స్టైల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మాస్ కమర్షియల్ అంశాలతో పాటు శంకర్ ఒక సందేశాన్ని కూడా ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసే 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కియరా అద్వానీ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus