Shakeela: షకీలా చెడు అలవాట్లకు బానిస కావడానికి ఆ హీరోయిన్ కారణమా?

  • September 20, 2023 / 02:53 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి షకీలా ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో వ్యాంప్ పాత్రలలో నటించినటువంటి ఈమె భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో సినిమాలలో షకీలా నటిస్తుంది అనే విషయం తెలిస్తే చాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్లేవారు అంతలా ఈమె సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. ఇక సినిమాలలో ఇలాంటి పాత్రలలో నటిస్తున్నటువంటి షకీలా కొన్ని చెడు అలవాట్లకు కూడా బానిస అయ్యారు.

ముఖ్యంగా సిగరెట్లు తాగడం ఈమెకు పెద్ద వ్యసనంగా మారిపోయింది. తాజాగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కూడా హౌస్ లో పెద్ద ఎత్తున సిగరెట్లు కాల్చిన సంగతి తెలిసిందే. ఇలా షకీలా సిగరెట్లకు బానిస కావడానికి గల కారణాలను ఓ సందర్భంలో తెలియచేశారు. ఈమె బిగ్ బాస్ కి రాకముందు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈమె సిగరెట్లు కాల్చడానికి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ వల్లనే తాను ఇలాంటి సిగరెట్ కు అలవాటు పడ్డానని ఈమె తెలియజేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి పూజ చాలా స్టైలిష్ గా సీక్రెట్ కాల్చేది ఆమెను (Shakeela) చూసి తాను కూడా అలాగే కాల్చాలని నిర్ణయించుకున్నాను.

ఇలా పూజ భట్ ను చూసి తన లాగే సిగరెట్ల కాల్చాలి అన్న ఉద్దేశంతోనే తాను సిగరెట్లు కాల్చడం మొదలు పెట్టానని అదే అలవాటుగా మారి చివరికి ఒక వ్యసనంగా మారిపోయింది అంటూ ఈ సందర్భంగా షకీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈమె తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus