ఆ హీరోయిన్ స్ట్రాటజీ చూసి షాక్ అవుతున్న హీరోలు

  • October 7, 2018 / 03:22 AM IST

ఒక సాధారణ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ పరాయి భాషాకు చెందిన బొద్దు గుమ్మ తొలి చిత్రంతో ఆశించిన స్థాయి విజయం దక్కకపోయినా.. అనంతరం ఓ అగ్ర దర్శకుడి పంచన చేరడంతో అమ్మడికి అగ్ర కథానాయకుడి సరసన కథానాయికగా నటించే అవకాశంతోపాటు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల్లోనూ అవకాశాలు దక్కించుకొంది. అయితే.. అదృష్టం బాలేక ఆ అగ్ర కథానాయకుడితో నటించిన సినిమాతోపాటు.. ఆ ఫ్లోలో వచ్చిన మిగతా సినిమాలు కూడా డిజాస్టర్స్ అవ్వడంతో అమ్మడి కెరీర్ ఖతం అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. మళ్ళీ ఒక యావరేజ్ సినిమాతో తన ఉనికిని చాటుకొంది. ఈ సినిమా వెనుక కూడా ఆ బడా దర్శకుడి హస్తం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆ అగ్ర దర్శకుడి చెంతన కాక మరో యువ దర్శకుడి ఒడి చేరిందట ఆ బొద్దుగుమ్మ.

దాంతో ఆమెకు అర్జెంట్ గా ఆఫర్లు ఇప్పించడమే ఆమెకు తాను ఇచ్చే గిఫ్ట్ అని ఫీల్ అయిన ఆ యువ దర్శకుడు తన మరియు తన స్నేహితుల కాంటాక్ట్స్ ను కాస్త గట్టిగా వాడి ఆమెకు ఒకట్రెండు ఆఫర్లైతే ఇప్పించగలిగాడు. ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా రెగ్యులర్ గా జరిగే అంశాలే అయినప్పటికీ.. ఆ అమ్మడు కేవలం ఆ దర్శకుడితో తప్ప మరో ఎవరితోనూ, ఆఖరికి తనకు జంటగా నటించే కథానాయకులతో మిమిమమ్ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయడం లేదట. దాంతో.. ఆమెతో నటిస్తున్న హీరోలందరూ ఆ దర్శకుడ్ని చూసి కుళ్లుకుంటూ.. కథానాయిక యాటిట్యూడ్ ను చూసి షాక్ అవుతున్నారు. మరి ఈ ప్రొసెస్ లో అమ్మడు ఇంకెన్ని ఆఫర్లు దక్కించుకొంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి పబ్బం గడిపేస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus