దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. యంగ్ హీరోల నుంచి మొదలుకొని ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు. ఇలా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే తాజాగా కొన్ని సర్వేల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ధనివంతుడైనటువంటి హీరోల వివరాలను బయటపెట్టారు.
మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం అత్యంత ధనవంతుడైనటువంటి హీరోల జాబితాలో నాగార్జున మొదటి స్థానంలో నిలవడం విశేషం. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ధనిక హీరోగా మొదటి స్థానంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం నాగార్జున మొత్తం నికర ఆస్తులు విలువ కలిపి3010 కోట్ల రూపాయలు ఉన్నట్టు సమాచారం. ఇలా ఈ జాబితాలో అత్యంత రిచ్ హీరోగా నాగార్జున మొదటి స్థానంలో నిలవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున (Nagarjuna) ఒక్కో సినిమాకు 15 కోట్లకు మించి రెమ్యూనరేషన్ తీసుకోరు అంతేకాకుండా సినిమాలు కూడా చాలా వరకు తగ్గించారు. అడపాదప సినిమాలు చేస్తున్నటువంటి ఈ హీరో అత్యధిక ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలవడంతో ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా ఎన్నో సినిమాలు సీరియల్స్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి అలాగే ఇతర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. నాగార్జున రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఎంతో మంచి సక్సెస్ అయిన సంగతి మనకు తెలుస్తుంది. అలాగే అన్నపూర్ణ స్టూడియోతో పాటు హైదరాబాదులో కొన్ని కన్వెన్షన్ సెంటర్స్ కూడా ఈయనకు ఉన్నాయని తెలుస్తుంది. ఇలా వీటి ద్వారా భారీ స్థాయిలోనే ఆస్తులను సంపాదించి సౌత్ ఇండస్ట్రీలోనే రిచ్ హీరోగా గుర్తింపు పొందారు.