డీసెంట్ టి.ఆర్.పి రేటింగ్ లను నమోదు చేసిన సూర్య, నితిన్ సినిమాలు..!

  • January 22, 2021 / 09:20 AM IST

కరోనా కారణంగా థియేటర్లు 9నెలల పాటు మూతపడటంతో.. ఓటిటి లకు డిమాండ్ పెరిగింది. అదే విధంగా టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాలను కూడా ప్రేక్షకులు ఎక్కువగా చూస్తూ వచ్చారు. ఆ టైములో డైలీ సీరియల్స్ కూడా కొన్నాళ్ల పాటు నిలిచిపోవడంతో.. టీవీల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతీ సినిమాకి మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేది. అయితే ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడం.. ప్రేక్షకులు కూడా కరోనాకి భయపడకుండా బిగ్ స్క్రీన్ పై సినిమాలను చూడటానికి ఇంట్రెస్టింగ్ గా వెళ్తుండడంతో.. బుల్లితెర పై టెలికాస్ట్ అయ్యే సినిమాలను ప్రేక్షకులు లైట్ తీసుకుంటూ వస్తున్నారు అనే చెప్పాలి.అందులోనూ సంక్రాంతికి 4 సినిమాలు విడుదలవ్వడంతో ప్రేక్షకులు బుల్లితెరను పట్టించుకోవట్లేదని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో గత వారం టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమాలకు భారీగా టి.ఆర్.పి రేటింగ్లు నమోదు కాలేదు. అలా అని తీసిపారేసే విధంగా కూడా కాదులెండి.

సరే ఓసారి గతవారం టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమాలకు ఎంతెంత టి.ఆర్.పి లు నమోదయ్యాయో ఓ లుక్కేద్దాం రండి :

1) భీష్మ: నితిన్ -రష్మిక జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భీష్మ’ 7.60 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. మొదటి సారి ఈ చిత్రం 6.65 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చెయ్యగా..! ఈసారి ఇంప్రూవ్-మెంట్ చూపించింది.

2) ఆకాశం నీ హద్దురా: సూర్య నటించిన ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కావడం వలన అనుకుంట..టీవీల్లో కేవలం 6.83 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది.

3) వినయ విధేయ రామ: మరోసారి రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రం సత్తా చాటింది. 17వ సారి కూడా 3.92 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

4) బిచ్చగాడు: ఇప్పటికీ టీవీల్లో సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు ‘బిచ్చగాడు’. ఈసారి కూడా ‘బిచ్చగాడు’ చిత్రం 3.60 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

5) గంగ: లారెన్స్, తాప్సి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 3.50 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

6) సింహమంటి చిన్నోడు: విజయ్ హీరోగా వచ్చిన ఈ డబ్బింగ్ చిత్రం 2.20 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

7) ఒరేయ్ బుజ్జిగా: రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ అయిన ‘ఒరేయ్ బుజ్జిగా’ 2.18 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

8) గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ ఆల్ టైం హిట్ అయిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం 2.14 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

9) భరత్ అనే నేను: మహేష్ బాబు – కొరటాల శివ ల ‘భరత్ అనే నేను’ చిత్రం 2.06 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

10) పందెం కోడి2: విశాల్ హీరోగా వచ్చిన ఈ ‘పందెం కోడి2’ చిత్రం ఈసారి 1.84 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus