ఛత్రపతి’..సినీ విశ్వరూపం

  • April 25, 2016 / 01:49 PM IST

ఆరుఅడుగుల అందగాడిగా….హైట్ కి తగ్గ పర్సన్యాలిటీ తో అభిమానుల్ని అలరిస్తున్న అడవి రాముడిగా…
మాస్..క్లాస్ అని తేడా లేకుండా…తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే కధానాయకుడిగా…
ఈ వర్షం సాక్షిగా అంటూ…అందాల భామతో ఆడిపాడినా…
జగమంత కుటుంభం నాది…ఏకాకి జీవితం నాది అంటూ జీవిత భావాన్ని ఆవిష్కరించినా…
గుండు సూది…గుండు సూది అంటూ అందాల భామ గుండెల్లో లోతుగా గుచ్చుకున్నా….
మై నేమ్ ఈజ్ బిల్లా అంటూ క్రూరమైన డాన్ గా ప్రచండ విశ్వరూపం చూపించినా..
మిర్చి కుర్రాడిగా…సీమ పోరుషం పై ప్రతిఘటించినా…
అమరేంద్ర బాహుబాలిగా….తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా కీర్తిపాతాకానికి ఎగరేసినా….
ఈ నవరస సమ్మేళనం ఒక్క ప్రభాస్ కే సొంతం

మరి తొలి సినిమా ఈశ్వర్ నుంచి ఈనాటి అమరేంద్ర బాహుబలి వరకు ప్రభాస్ సినీ విశ్వరూపాన్ని ఒక లుక్ వేద్దాం రండి…

‘ఈశ్వర్’

రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా…మాస్ మ్యానియాకు సరికొత్త ఊపు తెప్పించే క్రమంలో ‘ఈశ్వర్’గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమాతో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా ప్రభాస్ మాస్ హీరోగా మారిపోయాడు.

‘వర్షం’

2004లో ఎం.ఎస్ రాజు సినీనిర్మాణంలో…శొభన్ దర్శకతంలో ప్రభాస్ నటించిన ‘వర్షం’ భారీ హిట్ గా నిలిచి ప్రభాస్ ను ఇండస్ట్రీ లో టాప్ హీరోగా నిలిపడమే కాకుండా, ఉత్తమ యువ నటుడుగా సంతోషం ఫిల్మ్ అవార్డ్ సొంతం అయ్యింది. ఇక అప్పటినుంచీ ప్రభాస్ డిమాండ్ హీరోగా మారిపోయాడు.

‘చక్రం’

కమర్షియల్ హీరోగా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కించిన ‘చక్రం’లో నటించి మెప్పించాడు మన యంగ్ రెబెల్ స్టార్. ఈ సినిమాతో ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించడమే కాకుండా…నటుడిగా మరింత పరిపక్వతను పొందాడు

‘ఛత్రపతి’

ఇక అప్పటివరకూ ప్రభాస్ నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే….’ఛత్రపతి’లో ప్రభాస్ యాంగ్రీ యంగ్ హీరోగా నటించిన తీరు….అదే తరహాలో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన తీరు ఒక్కసారిగా ప్రభాస్ ను రెబెల్ హర్రోగ్కె ఆవిష్కరించాయి.

మున్నా

ఈ సినిమాలో యంగ్ లీడర్ గా, కాలేజ్ కుర్రాడిగా…తండ్రిపైనే యుద్దం చేసే నాయకుడిగా ప్రభాస్ నటన అద్భుతం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా, మరింత అందంగా కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

బుజ్జిగాడు

ఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రభాస్ ను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో, సరికొత్త మాడ్యులేషన్ తో ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ కు సరికొత్త పదును పెట్టి బయటకు తీశాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గానే కాకుండా కామెడీ సైతం పండించగలడు అని మరోసారి రుజువయ్యింది.

బిల్లా

స్టైలిష్ డాన్ గా…అకతాయి దొంగగా ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా, కనిపించాడు. ఈ సినిమాను సొంత బ్యానర్ లోనే కృష్ణం రాజు నిర్మించారు.

డార్లింగ్

ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బోయ్ గా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో కాజల్ తో రొమ్యాన్స్ చేసిన ప్రభాస్ మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

మిస్టర్ పర్ఫెక్ట్

జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

మిర్చి

కత్తి పట్టి నరుక్కోవడం కంటే ఒకరికి ఒకరు ప్రేమను పంచుకోవడం మంచిందన్న స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  భారీ విజయాన్ని అందుకుని, కలక్షన్ల వర్షం కురిపించింది.

బాహుబలి

ఎమోషనల్ విజువల్ వండర్ గా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు పొందింది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

అలా..ఈశ్వర్ నుంచి…మాహిష్మతి సామ్రాజ్య రధసారధుడిగా ఎదిగిన ప్రభాస్…బాహుబలి2 సైతం భారీ విజయం సాధించి వరుస విజయాలతో దూసుకుపోవాలని ఆశిద్దాం…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus