బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వగానే తేజ – శోభా ఇద్దరూ షాక్ తిన్నారు. శోభాశెట్టి అయితే, చాలాసేపు ఏడ్చేసింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సందీప్ వెళ్లిపోయిన తర్వాత ఫుడ్ కూడా తినకుండా తన బెడ్ దగ్గరకి వెళ్లి చాలాసేపు బాధపడింది. మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా కిచెన్ లో ఫుడ్ తిన్నా, శోభా మాత్రం ఒంటరిగా కూర్చుని చాలాసేపు బాధపడింది.
అయితే, ఇక్కడ వీకెండ్ నాగార్జున ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టీ శోభా తన గేమ్ ని మారుస్తుందా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, శోభా నిజంగానే సందీప్ ఎలిమినేషన్ అయితే ఫీల్ అయ్యిందా ? లేదా డ్రామాలు ఆడుతోందా అనేది ఆసక్తిగా మారింది. నిజానికి తేజ సందీప్ ని స్ట్రాంగ్ ప్లేయర్ వి అని, ఒక్కసారి నామినేషన్స్ లోకి వెళితే స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ అవుతావని చెప్పి నామినేట్ చేశాడు. దీంతో సందీప్ కి రెండో ఓటు పడింది. లేదంటే సందీప్ ఈవారం కూడా నామినేషన్స్ లో ఉండేవాడు కాదు.
అయితే, శోభాకి తేజ బాగా క్లోజ్. మరి ఇప్పుడు సందీప్ వెళ్లిపోయినందుకు శోభా తేజతో ఎలా రియాక్ట్ అవ్వబోతోందనేది చూడాలి. అంతేకాదు, ఈవారం నామినేషన్స్ లో నాగార్జున ఇచ్చిన హింట్స్ అర్ధమయి ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారు అనేది కూడా బిగ్ బాస్ ఆడియన్స్ కి ఇంట్రస్టింగ్ గా మారింది. మరోవైపు స్టార్ మా బ్యాచ్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఈవారం ఎవరు వెళ్లిపోతారో దాన్ని బట్టీ గేమ్ ప్లాన్ మారుద్దామని శివాజీ కాసుకుని కూర్చున్నాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిన వాళ్లు, హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతకి కూడా శివాజీ అండ్ బ్యాచ్ లో జాయిన్ అయిపోయింది.
దీన్ని బట్టీ శోభా – అమర్ – ప్రియాంక ఈ ముగ్గురిపై మిగతా వాళ్లు ఎన్ని పాయింట్స్ అయినా చెప్పి ఆర్గ్యూమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక సందీప్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో అందరూ సందీప్ గురించి మాట్లాడారు. హౌస్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అయితే, శివాజీ మాత్రం తేజకి బుద్ధులు చెప్పాడు. ఆ పిల్లతో అంటే శోభతో ఎక్కువ తిరగద్దని అది నీ ఆటని ఎఫెక్ట్ చేస్తదని చెప్పాడు. నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావని అన్నాడు. దీనికి తేజ ఒక్క సందర్భం ఏదైనా చెప్పండి మార్చుకుంటా అంటూ మాట్లాడాడు. దీనికి శివాజీ నువ్వు అడిగావ్ కాబట్టి చెప్పాను, లేదంటే నాకు అవసరం లేదని మాట తప్పించాడు.
అలాగే, గౌతమ్ కూడా సందీప్ ఎలిమినేషన్ ని జీర్ణించుకోలేదు. ఇప్పుడు తన టార్గెట్ ఎవరు అనే దానిపైనే దృష్టిపెట్టాడు. ఈవారం కెప్టెన్ గౌతమ్ కనక ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉండడు. మరి గౌతమ్ ఎవరిని నామినేట్ చేస్తాడు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. దీంతో 9వ వారం నామినేషన్స్ మొదలుకాబోతున్నాయ్. ఈవారం కూడా ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఆడియన్స్. ఒకవేళ శోభాశెట్టి నామినేషన్స్ లో ఉంటే ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉంటుంది. అదీ మేటర్.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!