టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉంటుంటే.. అతని భార్య నమ్రత శిరోద్కర్ నిత్యం అతని సినిమాల ప్రమోషన్స్ ను చూసుకుంటూ బిజీగా ఉంటుంది. అంతేకాదు మహేష్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను కూడా చక్కబెడుతూ ఉంటుంది. అక్కడితో అయిపోలేదు సితార,గౌతమ్ ల ఆలనా పాలనా చూసుకుంటూనే.. మరోపక్క కృష్ణ గారి కోడలిగా ఫ్యామిలీ విషయాలన్నిటినీ చక్కబెడుతుంటుంది. అయితే మహేష్ సోదరి.. మరియు ప్రముఖ నిర్మాత,దర్శకురాలు అయిన మంజుల ఘట్టమనేని, నమ్రత లు నిజ జీవితంలో ఎలా ఉంటారు?
అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని బయట పెట్టింది మంజుల. నమ్రతతో దిగిన ఓ ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసిన మంజుల.. “నేను నమ్రతతో గడిపే సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఆమె నా మరదలు మాత్రమే కాదు, నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఈ సూపర్ వుమన్ నుండీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది” అంటూ నమ్రత పై ప్రశంసల వర్షం కురిపించింది మంజుల.
ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ‘షో’ ‘నాని’ ‘పోకిరి’ ‘ఏమాయ చేసావె’ వంటి చిత్రాలను నిర్మించిన మంజుల సందీప్ కిషన్ తో ‘మనసుకి నచ్చింది’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె ఓ వెబ్-సిరీస్ను నిర్మిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ వెబ్ సిరీస్ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తుంది.