Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7…వైరల్ అవుతున్న కొత్త ప్రోమో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. త్వరలోనే ఈ సీజన్ ప్రసారమవుతుందని.. ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ అంశాలు, భావోద్వేగాలు మిళితమై ఉంటాయని నిర్వాహకులు సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోని పంచుకున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ కూడా స్టార్ మరియు డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హోస్ట్ ఎవరు అన్నది చెప్పలేదు. చాలా కాలంగా నాగార్జున ఈ షో నుండీ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ సస్పెన్స్ కొనసాగించాలి అనుకున్నారో ఏమో ..

కానీ మొన్నటికి మొన్న ప్రకటించలేదు. దీంతో ఆ ప్రచారం నిజమని అంతా అనుకున్నారు. అయితే లేటెస్ట్ ప్రమోతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది అని చెప్పాలి. బిగ్ బాస్ 7 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో లో నాగ్ కనిపించి సర్ప్రైజ్ చేశారు.కుడి ఎడమైతే పొరపాటు లేదో’ అంటూ నాగ్ పాట పాడుతూ తనదైన శైలిలో చిటికె వేయడంతో, బ్యాగ్రౌండ్ లో ఉన్న వస్తువులన్నీ గాల్లోకి ఎగురుతున్నట్లు ఈ ప్రోమోలో ఉంది.

ఈ ప్రోమోలో నాగ్ కొత్త లుక్ బాగుంది. సీజన్ 7 మరింత కొత్తగా ఉండబోతుంది అనే క్లారిటీ ఇచ్చింది. సీజన్ 3 నుండీ బిగ్ బాస్ ను నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ను నాగ్ డీల్ చేసే విధానం బాగుంటుంది. అందుకే బిగ్ బాస్ పై అందరిలోనూ ఆసక్తి ఎక్కువ అని చెప్పాలి.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus