బిగ్ బాస్4: ముగ్గురి హగ్ వైరల్.!

ఈసారి బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు. మోనాల్ – అఖిల్ – అభిజిత్ వీళ్ల స్టోరీని రెండోవారం నుంచీ ఫాలో అయితే ప్రేమదేశం సినిమాని తలపించింది. ఇదే విషయాన్ని లాస్ట్ వీక్ సమంతతో జాయిన్ అయిన్ హైపర్ ఆది కూడా చెప్పాడు. అయితే, ఇప్పుడు ఈ ప్రేమదేశం స్టోరీకి ఎట్టకేలకి శుభం కార్డ్ పడినట్లుగానే కనిపిస్తోంది. ముగ్గురం ఫ్రెండ్స్ గానే ఉందాం అని క్లైమాక్స్ లో హీరోయిన్ టబు చెప్పినట్లుగానే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురూ ఫ్రెండ్స్ గా గట్టి హగ్ ఇచ్చుకున్నారు. మరి ఇంతకంటే గొప్ప క్లైమాక్స్ ఏముంటుంది..? అందుకే ఇప్పుడు ఈ ముగ్గురు హగ్ చేసుకున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజానికి గత రెండు మూడు రోజుల నుంచి అభిజిత్ అండ్ అఖిల్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే వ్యూవర్స్ చాలా ఆనందపడ్డారు. అంతేకాదు, మోనాల్ తో అభిజిత్ గార్డెన్ ఏరియాలో కూర్చుని అన్ని విషయాలు క్లియర్ చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన అఖిల్ వాళ్లతో జాయిన్ అయితే ఈ ముగ్గురు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడం బిగ్ బాస్ హౌస్ లో గడిచిన 9వారాల్లో ఫస్ట్ టైమ్ ఆడియన్స్ చూశారు. ఆ ఫీల్ ని బాగా ఎంజాయ్ చేశారు.

తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ 50రోజుల జెర్నీని హౌస్ మేట్స్ అందరూ కలిసి చూశారో అప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయారు. ఈ జెర్నీ చూసిన తర్వాత మోనాల్, అఖిల్, అభిజిత్ ముగ్గురూ ఫ్రెండ్స్ గా ఒక క్యూట్ హగ్ ఇచ్చుకున్నారు. ఈ వ్యూజువల్ బిగ్ బాస్ లవర్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చింది. మరి ఈ ముగ్గురిలో క్లైమాక్స్ వరకూ అంటే టాప్ -5 వరకూ నిలిచేది ఎవరు..? గెలిచేది ఎవరు..? అనేది ఆసక్తికరం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus