The Family Man Season 2: నటీనటుల జీతాలు ఎంతంటే?

Advertisement

మరోసారి ఓటీటీ వరల్డ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు వండర్ క్రియేట్ చేశారు. సీజన్ 1 రిలీజ్ చేసినప్పుడు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో దర్శకద్వయం రాజ్ అండ్ డీకే పేర్లు ఒక్కసారిగా నేషనల్ మీడియాలో మారుమ్రోగిపోయాయి. నిజానికు అమెజాన్ ప్రైమ్ లోనే నెంబవ్ వన్ సిరీస్ గా క్లిక్కవుతుందని ఎవరు కూడా అనుకోలేదట. ఇక అదే బూస్ట్ తో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ సిజన్ 2 కూడా బాగానే క్లిక్కయ్యింది. ఇక ఇందులో నటించిన వారికి పారితోషికాలు కూడా గట్టిగానే అందాయట.

అయితే అందరికి సాలరీ లెక్కన రౌండ్ ఫిగర్ పేమెంట్స్ ను సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ కు కాస్త తక్కువగానే ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం గట్టిగానే ఇచ్చారని తెలుస్తోంది. అందరి కంటే ఎక్కువగా శ్రీకాంత్ తివారి పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ 10కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక రాజీ పాత్రలో నటించిన సమంతకు 3 నుంచి 4కోట్ల మధ్యలో ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ప్రియమణి సుచిత్రా తివారి పాత్రలో నటించగా ఆమెకు మొదటి సీజన్ కంటే ఎక్కువగా 80 లక్షలు అందినట్లు సమాచారం.

దర్శన్ కుమార్ (మేజర్ సమీర్) ఒక కోటి తీసుకోగా ఆశ్లేషా ఠాకూర్ (ద్రితి తివారి) 50లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అరవింద్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న శరద్ కేల్కర్ కు 1.6కోట్లు దక్కినట్లు టాక్. ఇక చివరగా షరీబ్ హష్మి ( జెకే తల్పడే) – 65 లక్షలు. సన్నీ హిందూజా (మిలింద్) – 60 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేమెంట్స్ చూస్తుంటే భవిష్యత్తులో తారలు ఒక చోట సక్సెస్ కాకపోయినా మరొక చోట మాత్రం కోట్లల్లో ఆదాయాన్ని అందుకోచ్చని చెప్పవచ్చు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus